పూజతో ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-23T05:53:03+05:30 IST

అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘పుష్ప’ చిత్రం సంచలన విజయం సాధించి, జాతీయ స్థాయిలో అర్జున్‌ ఇమేజ్‌ను అమాంతం...

పూజతో ప్రారంభం

అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘పుష్ప’ చిత్రం సంచలన విజయం సాధించి, జాతీయ స్థాయిలో అర్జున్‌ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. 2021లో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌   సాధించి, రూ 350 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్‌, పాటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేశాయి. ఈ చిత్రం రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ ‘పుష్ప’ సీక్వెల్‌కు పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం:  మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, పాటలు: చంద్రబోస్‌, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కెవీవీ బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబా సాయికుమార్‌ మావిడిపల్లి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్‌. 


Updated Date - 2022-08-23T05:53:03+05:30 IST

Read more