హైదరాబాద్ లో ‘స్టార్ మా’ సూపర్ సింగర్ జూనియర్ ఆడిషన్స్

ABN , First Publish Date - 2022-04-08T22:31:51+05:30 IST

ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ మ్యూజికల్ షో సూపర్ సింగర్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎందరో ప్రతిభ కలిగిన గాయనీ, గాయకులు వెలుగులోకి వస్తున్నారు. త్వరలో సూపర్ సింగర్ జూనియర్ ప్రారంభం కాబోతోంది. ఎందరో ప్రతిభ కలిగిన చిన్నారులు పోటీ పడబోతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రోగ్రామ్ కోసం స్టార్ మా వారు హైదరాబాద్ లో ఆడిషన్స్ జరపబోతున్నారు. ఆరేళ్ళ నుంచి 15 సంవత్సరాల లోపు బాలబాలికలు.. ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఆడిషన్స్ మార్చ్ 27న వైజాగ్ లో జరగగా.. హైదరాబాద్ లో ఈ నెల 10వ తేదీన జరగబోతున్నాయి.

ఆడిషన్స్ , రిజిస్ట్రేషన్స్ ఒకే చోట జరగబోతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన  ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సెయింట్ జార్జ్ గ్రామర్ గాళ్స్ స్కూల్, హోటల్ తాజ్ మహల్, కింగ్ కోఠి రోడ్డు, హైదరాబాద్ లో ఆడిషన్స్ జరగబోతున్నాయి. సంగీతంలో అద్భుతాలను సృష్టించాలన్న సంకల్పం, మాట పట్ల మమకారం, సాధించాలనే తపన, అన్నిటినీ మించి ప్రతిభ ఉందనే నమ్మకం ఉంటే చాలు.. మీరు సూపర్ సింగర్ కావచ్చని ఎందరో చిన్నారులను ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సాహిస్తూ వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘స్టార్ మా’ వారు.   Updated Date - 2022-04-08T22:31:51+05:30 IST

Read more