Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్మాన్ ఖాన్ సినిమాలో స్టార్ బాక్సర్
ABN , First Publish Date - 2022-10-30T02:18:47+05:30 IST
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమాలో స్టార్ బాక్సర్ నటించనున్నాడు.

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమాలో స్టార్ బాక్సర్ నటించనున్నాడు. సల్లూ భాయ్ ఈ విషయాన్ని తెలుపుతూ అందుకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాకు ఫర్హద్ సామ్జీ (Farhad Samji) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde), వెంకటేశ్ (Venkatesh), జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ అతిథి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ (Vijender Singh) నటించనున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విజేందర్ సింగ్ అక్టోబర్ 29న పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో సెట్స్‌లోకి విజేందర్‌కు స్వాగతం చెబుతూ సల్లూ భాయ్ పోస్ట్ పెట్టాడు. ఓ ఫొటోను షేర్ చేశాడు. ‘‘మా బాక్సర్ భాయ్ విజేందర్ సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సెట్స్‌లోకి స్వాగతం’’ అని సల్మాన్ తెలిపాడు. ఈ చిత్రంలో జెస్సీ గిల్, సిద్దార్థ్ నిగమ్, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఈద్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. తన పుట్టిన రోజును కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డే ఈ మూవీ సెట్స్‌లోనే జరుపుకొంది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ కలసి ఆమెను బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. ఈ సంబరాల్లో జగపతి బాబు కూడా పాల్గొన్నాడు.