స్టాండప్‌ రాహుల్‌ పెద్ద హిట్‌ అవుతుంది

ABN , First Publish Date - 2022-03-17T09:30:59+05:30 IST

తొలి సినిమాలో ఉన్నంత యంగ్‌గా ఉన్నాడు. దర్శకుడు శాంటో అనుకున్న విధంగా సినిమా తెరపైకి తెచ్చాడు. పాత్రలకు తగ్గ నటులు దొరికారు. సినిమా పెద్ద హిట్టవ్వాలి...

స్టాండప్‌ రాహుల్‌ పెద్ద హిట్‌ అవుతుంది

‘స్టాండప్‌ రాహుల్‌’ టీమ్‌కి నా శుభాకాంక్షలు. ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ చాలా కొత్తగా కనిపించాడు. అతను తొలి సినిమాలో ఉన్నంత యంగ్‌గా ఉన్నాడు. దర్శకుడు శాంటో అనుకున్న విధంగా సినిమా తెరపైకి తెచ్చాడు. పాత్రలకు తగ్గ నటులు దొరికారు. సినిమా పెద్ద హిట్టవ్వాలి. వర్షకు మంచి భవిష్యత్తు ఉంది’ అని వరుణ్‌ తేజ్‌ అన్నారు. రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. గురువారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో భాగా చేశానంటే సగం క్రెడిట్‌ వర్షదే. సినిమా బాగా రావడానికి కారణం మా నిర్మాతలే. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ఇది. మీకూ నచ్చుతుంది’ అని అన్నారు. 


ఇంద్రజ మాట్లాడుతూ ‘ఇది వెరీ పాజిటివ్‌ మూవీ. నూటికి 90 మంది ఈ సినిమాతో కనెక్ట్‌ అవుతారు’ అన్నారు.  దర్శకుడు శాంటో మాట్లాడుతూ ‘ఇది కామెడీ చిత్రం కాదు. రెండు గంటలు నవ్విద్దాం అని చేసిన సినిమా కాదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ల కోసం నిలబడాలి, తలబడాలి అనే సందేశం ఉంది’ అని చెప్పారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘శాంటో నా పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకూ నచ్చుతుంది’ అన్నారు. 


Updated Date - 2022-03-17T09:30:59+05:30 IST

Read more