SS Rajamouli: జపాన్‌లో సంచలనం సృష్టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2022-11-25T22:22:51+05:30 IST

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం

SS Rajamouli: జపాన్‌లో సంచలనం సృష్టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైంది. అక్కడ కూడా భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. అత్యంత వేగంగా 300మిలియన్ జపనీస్ యెన్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  


జపాన్‌లోని 44నగరాల్లో, 209స్క్రీన్స్‌లో, 31ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైంది. 305మిలియన్ జపనీస్ యెన్ వసూళ్లను రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో ఈ కలెక్షన్స్ 17.9కోట్లకు సమానం. ఈ చిత్రాన్ని 34రోజుల్లో 2లక్షల మంది వీక్షించారు. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు ఇప్పటికి ‘ముత్తు’ (Muthu) పేరిట ఉంది. 24ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం 400మిలియన్ జపనీస్ యెన్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ప్రస్తుతం రెండో స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో జక్కన్న, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిక్షనల్ స్టోరీగా రూపొందిందింది. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతరామ రాజులను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టించడంతో ఈ సినిమా ఆస్కార్స్ బరిలో నిలిచింది. అకాడమీ అవార్డ్స్ కోసం పలు కేటగిరిల కింద పోటీపడుతుంది.  



Updated Date - 2022-11-25T22:22:51+05:30 IST