నాన్నకి మొత్తం.. నాకు 20 నిమిషాలే: SS Rajamouli

ABN , First Publish Date - 2022-06-01T01:45:34+05:30 IST

‘బ్రహ్మాస్త్రం’ (Brahmāstram) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji).. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో కలిసి మంగళవారం విశాఖపట్టణాన్ని (Visakhapatnam) సందర్శించారు. అంతకంటే ముందు వారు

నాన్నకి మొత్తం.. నాకు 20 నిమిషాలే: SS Rajamouli

‘బ్రహ్మాస్త్రం’ (Brahmāstram) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)..  దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో కలిసి మంగళవారం విశాఖపట్టణాన్ని (Visakhapatnam) సందర్శించారు. అంతకంటే ముందు వారు ప్రఖ్యాత సింహాచలం నారసింహ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైజాగ్ ‘ఐకానిక్ మెలోడీ’ థియేటర్‌లో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ  ప్రతిష్టాత్మమైన  సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తుండటం విశేషం. చిత్ర ట్రైలర్‌ని జూన్ 15న వినూత్నంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


తాజాగా వైజాగ్‌లో జరిగిన కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘రణబీర్ కపూర్ అడిగారు ఈ సిటీ దేనికి ఫేమస్ అని.? నేను లవ్ బర్డ్స్‌కి ఫేమస్ అని చెప్పాను (నవ్వుతూ..). 4 సంవత్సరాల క్రితం కరణ్ జోహార్‌ (Karan Johar) ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను, మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని ఒకరున్నారు. ఒకసారి ఈ కథ విన్నాక మీకు నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటిసారి అయాన్‌ను కలిశాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే.. ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నప్పటి ఎగ్జైట్‌మెంట్‌కి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తరువాత తను తయారు చేసుకున్న  విజువల్స్.. తను అప్పటివరకు షూట్ చేసిన మెటీరియల్ అంతా చూపిస్తుంటే.. సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్సయ్యాను. ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అనే ఒక సినిమాని తయారుచేశాడు. ఈ సినిమాని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్నగారికి మొత్తం చూపించాడు. ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ట్రిపుల్ ఆర్ తర్వాత నేను రెండుసార్లు ముంబైకి వచ్చాను.. అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా అన్నం ఉడికిందా.. లేదా.. అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చారు.


ఇంకా రాజమౌళి మాట్లాడుతూ..‘‘ స్క్రీన్ మీదే కాకుండా పర్సనల్‌గా కూడా నాగార్జున (Nagarjuna)గారంటే నాకు చాలా ఇష్టం. ఇక ఆలియా భట్ (Alia Bhatt) గురించి చెప్పాలంటే.. ఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం..’’ అని అన్నారు. కాగా, ‘బ్రహ్మాస్త పార్ట్ 1: శివ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్‌, ఆలియా భట్, మౌని రాయ్ మరియు నాగార్జున అక్కినేని వంటి భారీ తారాగణం నటించారు.

Updated Date - 2022-06-01T01:45:34+05:30 IST

Read more