SS Rajamouli: కృష్ణగారి రూటే సపరేటు.. అన్ని ప్రయోగాలే..

ABN , First Publish Date - 2022-11-15T19:58:55+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయనకి నివాళిగా నవంబర్ 16న చిత్ర పరిశ్రమకి నిర్మాతల కౌన్సిల్ సెలవు ప్రకటించింది..

SS Rajamouli: కృష్ణగారి రూటే సపరేటు.. అన్ని ప్రయోగాలే..

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయనకి నివాళిగా నవంబర్ 16న చిత్ర పరిశ్రమకి నిర్మాతల కౌన్సిల్ సెలవు ప్రకటించింది. ఆయన మృతదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన ఇంటికి కృష్ణ పార్థివదేహాన్ని తరలించారు. అనంతరం ఎంతోమంది సినీ ప్రముఖులు వచ్చి ఆయనకి నివాళులు అర్పించి వెళుతున్నారు. అలాగే.. ఇక్కడికి రాలేని మరికొందరూ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. అందులో టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కూడా ఉన్నాడు. ఆయన ఆస్కార్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌కి భాగంగా చికాగోలో ఉన్నాడు. ఈ తరుణంలోనే కృష్ణ మరణం వార్త విని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.


ఎస్‌ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్‌లో.. ‘సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణం గురించి విని చాలా బాధపడ్డాను. 300+ సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి కృష్ణగారు చేసిన కృషి అందరికీ తెలిసిందే. కొత్త టెక్నాలజీల పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, అభిరుచి ఆయనని మిగిలిన వారి నుండి వేరుగా ఉంచుతుంది.


అలాగే.. వాటిని ఉపయోగించడానికి అతని ధైర్యం. ఆయన మొదటి 70ఎంఎం చిత్రం, మొదటి కలర్ మూవీ, అనేక ఇతర చిత్రాలతో తెలుగు సినిమాల్లో విప్లవాత్మకంగా మార్పును తీసుకొచ్చారు. తెలియని మార్గంలో ప్రయాణించడానికి ఏ మాత్రం భయపడొద్దని ఆయన అందరికీ చేసి చూపించారు. ఆయన చేసిన గొప్ప కృషికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. మహేష్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-11-15T19:58:55+05:30 IST