సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Alluri First Look : నిజాయితీకి మారుపేరుగా శ్రీవిష్ణు

ABN, First Publish Date - 2022-07-01T17:39:45+05:30

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sreevishnu) స్టైలే వేరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రెస్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన శ్రీవిష్ణు.. తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sreevishnu) స్టైలే వేరు. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రెస్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన శ్రీవిష్ణు.. తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రాబోతున్నాడు. సినిమా పేరు ‘అల్లూరి’ (Alluri). ‘నిజాయితీకి మారు పేరు’ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.  లక్కీ మీడియా (Lucky Media) బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ (Bekkam Venugopal) ఈ సినిమాను నిర్మి్స్తున్నారు. శ్రీవిష్ణు కెరీర్ లో మొట్టమొదటి పోలీస్ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. నిజాయితీ నిండిన కథతో ఈ సినిమాను రూపొందించనున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో పోలీసుల గొప్పతనాన్ని చాటి చెప్పబోతున్నాడట. ఈ క్రమంలో తీవ్రంగా పరిశోధన చేసి పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట దర్శకుడు. శ్రీవిష్ణు  లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా అతడి పాత్రను మలిచినట్టు టాక్. ఈ రోజు (శుక్రవారం) ‘అల్లూరి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.


కోరమీసంతో పోలీస్ యూనిఫామ్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తుండగా.. సుమన్ (Suman) కీలకపాత్రలో కనిపించబోతున్నారు. తనికెళ్ళ భరణి, మధుసూదనరావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్విరాజ్, రవివర్మ, జయవాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట (Raj thota) చాయాగ్రహణం నిర్వహిస్తున్నాడు. 


కొత్తగా డ్యూటీలోకి చేరిన ఓ పోలీసాఫీసర్.. తన విప్లవాత్మక ఆలోచనలతో మొత్తం డిపార్ట్ మెంట్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? ఉన్నతాధికారుల నుంచి అతడు ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కొన్నాడు? నేరస్తుల పట్ల అతడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? క్రైమ్ రేట్ ను ఎలా తగ్గించాడు? అనే అంశాల్ని ఈ సినిమాలో సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నాడట దర్శకుడు. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమాకు అతి త్వరలో విడుదల తేదీ ప్రకటించబోతున్నారు.  విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju) ఇంటిపేరునే తన ఒంటి పేరుగా చేసుకొన్న పోలీస్ గా శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

Updated Date - 2022-07-01T17:39:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!