సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Avatar 2: తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాసిందెవరో తెలుసా?

ABN, First Publish Date - 2022-12-13T16:43:53+05:30

జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్: ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌కి ఓ ప్రత్యేక ఉంది. అదేంటంటే..

Avatar 2
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) అద్భుత సృష్టి ‘అవతార్’ (Avatar). ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌‌గా ‘అవతార్: ది వే ఆఫ్‌ వాటర్’ (Avatar: The Way of Water) రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు. ‘అవతార్ 2’ ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘అవతార్ 2’ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే.. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ (Telugu Version) కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌‌డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. ‘అవతార్-‌2: ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌‌కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ‘అవతార్ 2’ (Avatar 2) తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది. ఆ ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని గంటల పాటు వెయిట్ చేయక తప్పదు.

Updated Date - 2022-12-13T16:53:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!