సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రీకాంత్ 'కోతల రాయుడు': విడుదల తేదీ ఖరారు..

ABN, First Publish Date - 2022-01-30T13:47:46+05:30

శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'కోతల రాయుడు'. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'కోతల రాయుడు'. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమాతో ఆయన విలన్‌గానూ మారారు. ఇందులో శ్రీకాంత్ పోషించిన విలన్ పాత్ర ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. అయితే, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా 'కోతల రాయుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


సుధీర్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ చోప్డా, నటాషా దోషి, ప్రాచీ సిన్హా హీరోయిన్స్‌గా నటించారు. ఫిబ్రవరి 4న విడుదల ఈ సినిమాను  చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ‘యు’ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఎ.ఎస్.కిశోర్, కొలన్ వెంకటేశ్ 'కోతల రాయుడు' చిత్రానికి నిర్మాతలు. చూడాలి మరి మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీకాంత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో.

Updated Date - 2022-01-30T13:47:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!