‘పెళ్ళిసందD’ బ్యూటీకి వరుస అవకాశాలు

ABN , First Publish Date - 2022-01-23T19:59:08+05:30 IST

దర్శకేంద్రుడు ‘పెళ్ళిసందD’ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టింది శ్రీలీల. గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అందం, అభినయంతో తొలి ప్రయత్నంలోనే యువత మనసుదోదుకుంది ఆమె. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో శ్రీలీల టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం మాస్ మహారాజా, నక్కిన త్రినాథరావు కలయికలో సెట్స్ పై ఉన్న ‘ధమాకా’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. రోషన్ లాంటి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. రవితేజ లాంటి సీనియర్ స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా అవకాశం అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘పెళ్ళిసందD’ బ్యూటీకి వరుస అవకాశాలు

దర్శకేంద్రుడు ‘పెళ్ళిసందD’ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టింది శ్రీలీల. గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం మంచి సక్సెస్ సాధించింది. అందం, అభినయంతో తొలి ప్రయత్నంలోనే యువత మనసుదోదుకుంది ఆమె. ఈ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ క్రెడిట్ తో శ్రీలీల టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం మాస్ మహారాజా, నక్కిన త్రినాథరావు కలయికలో సెట్స్ పై ఉన్న ‘ధమాకా’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. రోషన్ లాంటి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. రవితేజ లాంటి సీనియర్ స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా అవకాశం అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదండోయ్.. ఈ సినిమాతో అమ్మడు తన పారితోషికాన్ని రూ.1కోటికి పెంచేసిందట. 


వీటితో పాటు శ్రీలీల సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారి రెండు చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంది. అందులో ఒకదాంట్లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరో అయితే మరో సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరో అవడం విశేషం. ఈ రెండు సినిమాలతోనూ కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు. రవితేజ లాంటి పెద్ద హీరో చిత్రంతో పాటు.. పెద్ద బ్యానర్ లో ఒకేసారి రెండు సినిమాల్లో చాన్స్ కొట్టేయడంతో టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు చిత్రాలూ విడుదల కాబోతున్నాయి. మరి ఈ బ్యూటీ ఇంకెన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుందో చూడాలి.    

Updated Date - 2022-01-23T19:59:08+05:30 IST