సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vikram: తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికో తెలుసా?

ABN, First Publish Date - 2022-05-20T02:13:07+05:30

యూనివర్సల్ హీరో (Universal hero) కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సల్ హీరో (Universal hero) కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి.. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి నిర్మించారు కూడా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తుండగా.. హీరో సూర్య (Suriya) అతిథి పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్‪ని.. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. 


టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ (Nithiin) హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ (Sreshth Movies) ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్.. ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శ్రేష్ట్ మూవీస్ సన్నాహాలు చేస్తుంది. కాగా.. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించిన ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ (Girish Gangadharan) సినిమాటోగ్రాఫర్‪గా, ఫిలోమిన్ రాజ్ (Philomin Raj) ఎడిటర్‪గా పని చేస్తున్నారు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర తారాగణం.

Updated Date - 2022-05-20T02:13:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!