Sravana Bhargavi: ‘లైగర్’తో మళ్ళీ..
ABN , First Publish Date - 2022-08-16T17:55:09+05:30 IST
‘లైగర్’ (Liger) మూవీతో గాయనిగా మళ్ళీ అలరించడానికి సిద్ధమయ్యారు శ్రావణ భార్గవి (Sravana Bhargavi). పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda),
‘లైగర్’ (Liger) మూవీతో గాయనిగా మళ్ళీ అలరించడానికి సిద్ధమయ్యారు శ్రావణ భార్గవి (Sravana Bhargavi). పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన సినిమా ఇది. మన టాలీవుడ్లో ఉన్న సింగర్స్‌లో తన గాత్రంతో అద్భుతమైన పాటలను పాటి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బుల్లితెరపై వచ్చిన పలు పాపులర్ షోస్‌లో పాటలు పాడి బాగా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ భార్గవి బాగా పాపులర్ అయింది మాత్రం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలోని ‘సింహమంటి చిన్నోడే’ పాటతో. ఈ పాట తెచ్చిన గుర్తింపుతో ఇక అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం రాలేదు.
పెక్యులర్ వాయిస్‌తో శ్రావణ భార్గవి పాడిన పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్, మిక్కీ జె మేయర్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి అగ్ర సంగీత దర్శకుల వద్ద పాటలు పాడే అవకాశం అందుకున్నారు. శ్రావణ భార్గవి సింగర్ మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. స్టార్ హీరోయిన్స్ శృతి హాసన్, సమంత లాంటి వారికి తన గాత్రాన్ని అందించింది. కెరీర్లో బాగా రాణిస్తున్న సమయంలోనే తోటి గాయకుడు హేమచంద్రను వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా శ్రావణ భార్గవి చాలానే పాటలు పాడారు. అయితే, 2018లో నితిన్ హీరోగా వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ మూవీ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకున్న ఆమె త్వరలో విడుదల కాబోతున్న ‘లైగర్’ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ‘హాపట్’ అనేపాటను పాడారు. ఇప్పటికే, ఈ పాట విడుదలై యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.