Jabardasth: రష్మీ అవుట్.. అనసూయ ప్లేస్‌లో కొత్త యాంకర్!
ABN , First Publish Date - 2022-11-05T20:00:30+05:30 IST
తెలుగు బుల్లితెరపై దిగ్విజయంగా దూసుకుపోతోన్న కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). మొదటి నుండి అనసూయ (Anasuya) యాంకర్‌గా రన్ అయిన ఈ షో..

తెలుగు బుల్లితెరపై దిగ్విజయంగా దూసుకుపోతోన్న కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). మొదటి నుండి అనసూయ (Anasuya) యాంకర్‌గా రన్ అయిన ఈ షో.. భారీ ఆదరణను పొందడంతో.. వెంటనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ (Extra Jabardasth) అంటూ కామెడీ డోస్‌ని ఇంకాస్త పెంచారు. ఈ షోకి యాంకర్‌గా రష్మీ గౌతమ్.. వచ్చీరాని తెలుగు పదాలతో మరింత కామెడీని జతచేసింది. ఇక రీసెంట్‌గా నటిగా బిజీబిజీగా మారిపోయిన అనసూయ ‘జబర్దస్త్’కి గుడ్ బై చెప్పేసింది. అప్పటి నుండి.. ఈ కామెడీ షో కి కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు ఈ షోకి స్టార్ కమెడియన్స్ అయిన కొందరు వెళ్లిపోవడం, సడెన్‌గా అనసూయ కూడా టాటా చెప్పేయడంతో.. ఈ షో కామెడీ కష్టాల్లో పడిపోయింది. దీంతో గురువారం వచ్చే ‘జబర్దస్త్’కి, శుక్రవారం వచ్చే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’కి యాంకర్‌గా రష్మీనే వ్యవహరిస్తూ వస్తుంది. (new anchor to jabardasth)
ఈ షో జడ్జిలు మారుతూ ఉండటం, అలాగే అనసూయ, ఇంకొందరు కమెడియన్స్ అందరూ ఇలా దూరమవడంతో.. ఒకప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ షో.. ఈ మధ్యకాలంలో కాస్త డౌన్ అయింది. మరి ఇది గమనించారో.. లేదంటే ఈ రెండు షోలకు టైమ్ కేటాయించడం రష్మీ వల్ల కావడం లేదో.. లేదంటే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచాలని అనుకుంటున్నారో తెలియదు కానీ.. ‘జబర్దస్త్’ టీమ్ ఇప్పుడు మరో బ్యూటీఫుల్ యాంకర్‌ని ఈ షోకి తీసుకొస్తుంది. నవంబర్ 10న టెలికాస్ట్ కాబోయే ‘జబర్దస్త్’ షోతో సీరియల్ నటి సౌమ్య రావు (Sowmya Rao) యాంకర్‌గా పరిచయం కాబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో జడ్జి ఇంద్రజ (Indraja) ఆమెను యాంకర్‌గా పరిచయం చేస్తోంది. అయితే సౌమ్య రావు యాంకర్‌గా వస్తుండటంతో రష్మీ కూడా ‘జబర్దస్త్’కి గుడ్ బై చెప్పేసిందా? అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలకు తెరదించుతూ.. నవంబర్ 11న జరిగే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోమోని కూడా విడుదల చేశారు. ఈ షోలో యాంకర్‌గా రష్మీనే ఉంది. సో.. దీనిని బట్టి వారిచ్చిన క్లారిటీ ఏమిటంటే.. అనసూయ యాంకర్‌గా చేసిన ‘జబర్దస్త్’ షోకి కొత్త యాంకర్ సౌమ్య రావు ఇకపై యాంకర్‌గా వ్యవహరిస్తే.. ఎప్పటిలానే ‘ఎక్స్‌ట్రా’కు రష్మీ యాంకర్‌గా ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన యాంకర్ కూడా రష్మీ లానే వచ్చీరాని తెలుగు మాటలు మాట్లాడుతోంది. దీనిని బట్టి చూస్తే.. ఆమెను గ్లామర్ కోసమే ఈ షోకి యాంకర్‌గా తీసుకొస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది. మరి ఈ యాంకర్ మార్పిడి.. ఈ షోని ఏ రేంజ్‌కి తీసుకెళుతుందో చూడాలి.