NTR30: బాలీవుడ్ నుంచి కష్టమే.. సౌత్‌కే ఫిక్సయ్యారా?
ABN, First Publish Date - 2022-09-30T21:03:24+05:30
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘NTR30’పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘NTR30’పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎన్ని రూమర్స్.. వార్తలుగా వైరల్ అయ్యాయో.. అవుతున్నాయో తెలియంది కాదు. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలోనూ, హీరోయిన్ విషయంలోనూ ఇంకా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. చిత్రబృందం మాత్రం ఆ రూమర్స్‌కు బ్రేక్ వేయడం లేదు.. అప్డేట్ వదలడం లేదు. ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరో వార్త.. సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో బాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు చేసిన మేకర్స్.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుని, సౌత్ హీరోయిన్‌కే ఫిక్స్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. బాలీవుడ్‌లోని ఏ భామా.. ఈ సినిమాలో చేసేందుకు ముందుకు రావడంలేదో.. లేదంటే వారికి భారీ పారితోషికం సమర్పించుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. హీరోయిన్గా అయితే సౌత్ భామని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ (Alia Bhatt) అనుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ కూడా చేసింది. కానీ, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ సినిమా నుంచి ఆలియా తప్పుకుంది. ఆమె, ఎప్పుడైతే సైడ్ అయిందో.. హీరోయిన్గా అనేకానేక పేర్లు వినిపించాయి. కానీ ఏ ఒక్కరూ ఫైనల్ కాలేదు. చివరికి ఇటీవల ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రంతో అందరి మనసులు దోచేసిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పేరు కూడా వినిపించింది. ఇప్పుడు మాత్రం సౌత్ భామ, ‘మహానటి’ కీర్తి సురేష్ (Keerthi Suresh) పేరు వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ముఖ్యంగా నటనకు ఆస్కారమున్న పాత్ర కావడంతో.. అందుకు కీర్తి సురేష్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని.. మేకర్స్ భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. అయితే, మేకర్స్ మాత్రం ఈ విషయం కన్ఫర్మ్ చేయలేదు. ఈ విషయమే కాదు.. అసలే విషయం కూడా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ అలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది మరి.