సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sonali bendre: ‘ఎన్టీఆర్‌ 30’లో నేనా? ఈ విషయం నాకు తెలీదే!

ABN, First Publish Date - 2022-05-31T21:55:51+05:30

‘‘ఎన్టీఆర్‌(NTR) సినిమాలో సోనాలి బింద్రే.. (Sonali bendre) సినిమాను మలుపు తిప్పే పాత్రతో రీ ఎంట్రీ’’ చాలాకాలంగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. కొరటాల శివ (Koratala siva)దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించబోతున్న విషయం తెలిసిందే! ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. జూన్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఎన్టీఆర్‌(NTR) సినిమాలో సోనాలి బింద్రే.. (Sonali bendre)

సినిమాను మలుపు తిప్పే పాత్రతో రీ ఎంట్రీ’’

చాలాకాలంగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. 


కొరటాల శివ (Koratala siva)దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించబోతున్న విషయం తెలిసిందే! ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. జూన్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి తారక్‌ కసరత్తులు మొదలుపెట్టారు. ఆ మేకోవర్‌ పనుల్లో తారక్‌ బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం సోనాలి బింద్రేను సంప్రదించారని వార్తలొచ్చాయి. ఈ విషయంపై సోనాలి స్పందించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్‌ 30’(NTR 30)లో మీరు నటిస్తున్నారట కదా’ అన్న ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘‘నేనా? నిజంగా నాకు ఈ విషయం తెలీదు. దాని గురించి మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నాకు కొంచెం కూడా సమాచారం లేదు. ఒకవేళ అది నేను కాదేమో. అదే నిజమైతే ఇప్పటిదాకా నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ వార్తలన్నీ థ్రిల్లర్‌ సినిమాలాగా అనిపిస్తున్నాయి’ అంటూ ఆశ్చర్యకరంగా మాట్లాడారు. క్యాన్సర్‌ మహమ్మారిని జయించిన సోనాలి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడుతున్నారు. తాజాగా ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ (The broken news)అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. త్వరలో జీ5లో ఈ సిరీస్‌ స్ర్టీమింగ్‌ కాబోతుంది. 


Updated Date - 2022-05-31T21:55:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!