Sonal Chauhan: ఎఫ్ 3 సక్సెస్‌ను అలా ఎంజాయ్ చేస్తుందా..

ABN , First Publish Date - 2022-06-01T15:19:22+05:30 IST

ఎఫ్ 3 (F3) సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan). హిందీలో జన్నత్ (Jannat) సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన

Sonal Chauhan: ఎఫ్ 3 సక్సెస్‌ను అలా ఎంజాయ్ చేస్తుందా..

ఎఫ్ 3 (F3) సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan). హిందీలో జన్నత్ (Jannat) సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కుర్రభామ..ఆ తర్వాత తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. రేయిన్‌బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సోనాల్, ఆతర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దాంతో వరుసగా తెలుగు చిత్రాలలో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది. స్టార్ స్టేటస్ దక్కలేదు గానీ, ఇక్కడ అవకాశాలకు మాత్రం ఏమీ కొదవలేదు. ఇప్పటికే అమ్మడు దాదాపు 10కి పైగా తెలుగు సినిమాల్లో నటించింది.


ఇక తాజాగా సోనాల్ నటించిన తెలుగు సినిమా ఎఫ్ 3. ఇందులో ఒక కీలక పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. తమన్నా (Tamannah)తో సోనాల్ లవ్ ట్రాక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) బాగా డిసైన్ చేశాడు. ధియేటర్‌లో ఈ ట్రాక్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ నటించిన సినిమాలలో రాని పేరు ఇప్పుడు ఎఫ్ 3 బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో దక్కిందని అని సోనాల్ తెగ సంతోష పడిపోతుందట. ఇలా సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ సోనాల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌కు మంచి కిక్ ఇస్తూ ఉంటుంది. 


ప్రస్తుతం ఎఫ్ 3 సక్సస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ, మరోసారి సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ... సముద్రం దెగ్గర ఎంజాయ్ చేస్తున్న బికినీ ఫొటోస్‌ను పోస్ట్ చేసింది. మంచి హైట్ ఉండి, ఫిట్ పర్సనాలిటీ మైంటైన్ చేసే సోనాల్‌ను బికినీలో చూసిన వారు అల్లాడిపోతున్నారు. కాగా, సోనాల్ రెండు టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది. ఒకటి ప్రభాస్ 'ఆదిపురుష్' (Adipurush).. రెండు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ది ఘోస్ట్ మూవీ (The Ghost). ఘోస్ట్ మూవీలో రొమాంటిక్ పాత్రను, ఆదిపురుష్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న సూర్పనక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతాయని సోనాల్ చాలా నమ్మకంగా ఉంది. 

Updated Date - 2022-06-01T15:19:22+05:30 IST