అలా ‘హిట్‌ 2’ చేసేందుకు ఒప్పించారు

ABN , First Publish Date - 2022-12-02T05:10:29+05:30 IST

‘హిట్‌ 2’ చిత్రం చేయడం అంటే మరొక హీరో ఫ్రాంచైజీ సినిమాను లాగేసుకోవడమే అది నాకు ఇష్టం లేదు,చేయను అని శైలేష్‌కు చెప్పాను...

అలా ‘హిట్‌ 2’ చేసేందుకు ఒప్పించారు

‘హిట్‌ 2’ చిత్రం చేయడం అంటే మరొక హీరో ఫ్రాంచైజీ సినిమాను లాగేసుకోవడమే అది నాకు ఇష్టం లేదు,చేయను అని శైలేష్‌కు చెప్పాను. ‘వేర్వేరు నగరాల్లో పలువురు ఆఫీసర్లు సాల్వ్‌ చేసే కేసులతో కొన్ని భాగాలు చేసి, చివరలో వాళ్లందరినీ కలిపి ‘అవెంజర్స్‌’ తరహాలో ఒక పెద్ద చిత్రం చేయాలనే ఆలోచన ఉంది’ అని చెప్పి ‘హిట్‌ 2’ చేసేందుకు ఆయన నన్ను ఒప్పించారు. 


ఈ సినిమాలో ఏ దశలోనూ నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు. దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వె ళ్లాను. ఈ సినిమాలో కిల్లర్‌ హత్యలు చేయడానికి వెనుక ఉన్న కారణం నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ‘మేజర్‌’ చివరి దశ చిత్రీకరణలో ఉన్నప్పుడు ‘హిట్‌ 2’ ప్రారంభమైంది. పోలీసాఫీసర్‌ పాత్రకు కూడా అదే ఫిజిక్‌ను కంటిన్యూ చేశాను. 


ఓ ప్రేక్షకుడిలా కథ వింటాను. ఎక్కడా బోర్‌ కొట్టకపోతే ఆ సినిమా చేస్తాను. భవిష్యత్‌లో ఓ మంచి కామెడీ చిత్రం చేయాలని ఉంది. అగ్రహీరోలు తమ బేనర్‌లో నన్ను హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. 

Updated Date - 2022-12-02T05:10:29+05:30 IST

Read more