మరీ ఇంత అదృష్టమా?!

ABN , First Publish Date - 2022-08-23T05:57:42+05:30 IST

టాలీవుడ్‌లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు.. కృతి శెట్టి. ఒక్క సినిమాకే స్టార్‌ అయిపోవడం అంటే ఏమిటో, చూస్తుండగానే బిజీ కథానాయికగా...

మరీ ఇంత అదృష్టమా?!

టాలీవుడ్‌లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు.. కృతి శెట్టి. ఒక్క సినిమాకే స్టార్‌ అయిపోవడం అంటే ఏమిటో, చూస్తుండగానే బిజీ కథానాయికగా పేరు తెచ్చుకోవడం అంటే ఏమిటో కృతిని చూసి తెలుసుకోవాల్సిందే. తనకిప్పుడు తమిళనాట నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. మరో యేడాది వరకూ కృతి కాల్షీట్లు ఖాళీగా లేవు. ఆ రేంజ్‌లో ఉంది తన దూకుడు. ‘‘చిన్నప్పటి నుంచీ నన్ను అంతా ‘లక్కీ.. లక్కీ’ అంటుండేవారు. చిత్రసీమలోకి వచ్చాకగానీ నేనెంత అదృష్టవంతురాలినో అర్థమైంది. పది సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క  ‘ఉప్పెన’తో వచ్చేసింది. ఒక్కోసారి నా అదృష్టానికి నేనే ఆశ్చర్యపోతుంటాను. అయితే.. ప్రతిభ లేకపోతే ఎక్కడా రాణించలేం. ఆ విషయం నాకు తెలుసు. ఈ స్థానం రావడం నా లక్‌. కానీ నిలబెట్టుకోవడం నా శ్రమపైనే ఆధారపడి ఉందన్న విషయం నేను గుర్తించాను. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు నన్ను తమ ఇంటి అమ్మాయిలా చూస్తున్నారు. ఆ ప్రేమని, గౌరవాన్నీ కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను’’ అని చెప్పుకొచ్చింది కృతి. 

Updated Date - 2022-08-23T05:57:42+05:30 IST

Read more