సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వినాయకచవితి పర్వదినాన SK20 చిత్రం విడుదల

ABN, First Publish Date - 2022-05-31T02:52:53+05:30

‘వరుణ్ డాక్టర్ (Varun Doctor), కాలేజ్ డాన్ (College Don)’ వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఆయన హీరోగా.. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘వరుణ్ డాక్టర్ (Varun Doctor), కాలేజ్ డాన్ (College Don)’ వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఆయన హీరోగా.. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో  బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి (Anudeep KV) దర్శకత్వంలో.. ‘SK20’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.  అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వినాయకచవితి (Vinayaka Chavithi) పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలోని పాండిచ్చేరి,  బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో కథ నడుస్తుంది. శివకార్తికేయన్ సరసన మరియా ర్యాబోషప్క (Maria Ryaboshapka) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్(Sathyaraj) కీలక పాత్రలో నటిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు (Suresh Babu) మాట్లాడుతూ.. ‘‘ముందుగా శివకార్తికేయన్ ‘కాలేజ్ డాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించినందుకు ఆ చిత్రయూనిట్‌కు అభినందనలు. SK20 చిత్రాన్ని వినాయకచవితి పర్వదినాన తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు.



Updated Date - 2022-05-31T02:52:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!