Prince: శివకార్తికేయన్‌ మూవీకి క్లీన్‌ ‘యూ’ సర్టిఫికెట్‌.. రన్ టైం ఎంతంటే..

ABN , First Publish Date - 2022-10-14T16:20:17+05:30 IST

‘రెమో’ (Remo) సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సాధించిన తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)..

Prince: శివకార్తికేయన్‌ మూవీకి క్లీన్‌ ‘యూ’ సర్టిఫికెట్‌.. రన్ టైం ఎంతంటే..

‘రెమో’ (Remo)  సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సాధించిన తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan). ఇప్పటి వరకూ ఆయన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చారు. తాజాగా ఆయన డైరెక్ట్‌గా ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘జాతిరత్నాలు’ చిత్రంలో గుర్తింపు పొందిన అనుదీప్‌ కేవీ (Anudeep KV) ఈ చిత్రానికి దర్శకుడు. ‘ప్రిన్స్‌’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన శాంతి టాకీస్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.


ఆ పోస్ట్‌లో.. ఈ సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు క్లీన్‌ ‘యూ’ సర్టిఫికెట్‌ మంజూరు చేశారని అందులో తెలిపింది. అలాగే రన్ టైం 2 గంటల 23 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీని.. దీపావళి సందర్భంగా ఈ నెల 21న రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్‌కు సరసన ఉక్రెయిన్‌ భామ మరియా (Maria Ryaboshapka) హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్‌, ప్రేమ్‌జీ అమరన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించాడు. రెండు దేశాలకు చెందిన ప్రేమికుల మధ్య సాగే చిత్రంగా నిర్మించినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ చూస్తూ అర్థమవుతోంది.





Updated Date - 2022-10-14T16:20:17+05:30 IST