సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sindhooram: టీజర్ విడుదల.. సినిమా విడుదల ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2022-12-23T19:21:55+05:30

శివ బాలాజీ (Siva Balaji), ధర్మ (Dharma), బ్రిగిడా సాగ (Brigida Saga) ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో ..

Sindhooram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ బాలాజీ (Siva Balaji), ధర్మ (Dharma), బ్రిగిడా సాగ (Brigida Saga) ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం (Sindhooram). ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో.. చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి (Shyam Tummalapalli) మాట్లాడుతూ.. నక్సల్స్ పాయింట్‌తో.. ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని ఆశిస్తున్నాము. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవరాల్‌గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రాన్ని జనవరి 26న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని పేర్కొన్నారు. నిర్మాత ప్రవీణ్ రెడ్డి (Praveen Reddy) జంగా మాట్లాడుతూ.. సిందూరం సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది. టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న సిందూరం అందరికీ నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

Updated Date - 2022-12-23T19:21:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!