సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sitharamam : రిలీజ్ డేట్ ఖాయమైంది !

ABN, First Publish Date - 2022-05-25T20:29:50+05:30

మాలీవుడ్ యంగ్ సూపర్‌స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) ‘మహానటి’ తర్వాత తెలుగులో నటిస్తున్న మరో డైరెక్ట్ చిత్రం ‘సీతారామం’. స్వప్నా సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కీలక పాత్ర పోషిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాలీవుడ్ యంగ్ సూపర్‌స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) ‘మహానటి’ తర్వాత తెలుగులో నటిస్తున్న మరో డైరెక్ట్ చిత్రం ‘సీతారామం’. స్వప్నా సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కీలక పాత్ర పోషిస్తోంది. రామ్ అనే ఓ మిలటరీ లెఫ్టినెంట్.. ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి పుట్టిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ తో హృద్యమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. 


ఇది వరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. ఆగస్ట్ 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ ప్రకటించారు. ప్రపంచలోని ఎత్తైన పోస్టాఫీస్ లో ‘సీతారామం’ (Sitharamam) సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కథ ప్రకారం యుద్ధానికి సిద్ధమైన హీరో.. కథానాయికకి రాసిన ప్రేమలేఖల్ని ఈ పోస్టాఫీస్ నుంచే పోస్ట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల మనసును తాకుతాయని దర్శకుడు హను (Hanu) చెబుతున్నాడు. 


తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అదే పేరుతో విడుదల కాబోతోంది ‘సీతారామం’ (Sitharamam) చిత్రం. నాలుగేళ్ళ క్రితం శర్వానంద్ (Sharvanand) , సాయిపల్లవి (Saipallavi) జంటగా ‘పడిపడిలేచె మనసు’ అనే ప్రేమకథాచిత్రాన్ని తెరకెక్కించాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ఈ సినిమా ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అందుకే మంచి కథరాసుకొని నాలుగేళ్ళపాటు ఎంతో కష్టపడి ‘సీతారామం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. దుల్ఖర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్, మృణాల్ ఠాకూర్ గ్లామర్ అపీరెన్స్, రష్మికా అభినయం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  



Updated Date - 2022-05-25T20:29:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!