Sitharamam : ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్‌లో షూటింగ్

ABN , First Publish Date - 2022-04-12T15:32:27+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా మేకర్స్ టైటిల్ ను రివీల్ చేసి.. ఓ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా వదిలారు. యుద్ధానికి సన్నద్ధమయ్యే ఓ లెఫ్టినెంట్ ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడడం.. ఆమెకు ఉత్తరాల ద్వారా తన ప్రేమను తెలియపరచడం ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో ఈ ప్రేమకథను తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు దర్శకుడు హను. అయితే ఈ సినిమా షూటింగ్ విశేషాల్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు.

హిమాచల్ ప్రదేశ్ లోని ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లో ఈ సినిమాకి సంబంధించిన పలు సన్నివేశాల్ని చిత్రీకరించారు. సముద్ర మట్టానికి 12,500 ఎత్తులో ఉన్న స్పిట్ వ్యాలీలో ఉంది ఆ పోస్టాఫీస్. కాజా అనే నగరానికి దగ్గరలో ఉన్న హిక్కిమ్ అనే గ్రామంలో ఈ పోస్టాఫీస్ ఉంది. మైనస్ 25 డిగ్రీల టెంపరేచర్ లో ఎముకల కొరికే చలిలో ఆ గ్రామంలో ‘సీతారామం’ షూటింగ్ చేయడం తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నాడు దర్శకుడు. ఆ గ్రామస్తులు షూటింగ్ జరపడానికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందించారని, ఇది ఈ సినిమాకి సంబంధించిన అద్భుతమైన అనుభవమని, దుల్కర్ సల్మాన్ లాంటి హీరో దొరకడం తమ అదృష్టమని దర్శకుడు హను అభిప్రాయపడ్డాడు. ఎంతో అందంగా కనిపించే ఘాట్ రోడ్స్ లో ప్రాణాలకు తెగించి షూటింగ్ చేయడాన్ని తాము ఎంతో ఎంజాయ్ చేశామని అన్నారు హను. ‘సీతారామం’ చిత్రానికే ఆ సన్నివేశాలు హైలైట్స్ గా నిలిచిపోతాయని చెబుతున్నారు.  

Updated Date - 2022-04-12T15:32:27+05:30 IST