Rory: హైదరాబాద్-పాకిస్థాన్.. ‘సీతా రామం’ టచ్..
ABN , First Publish Date - 2022-10-04T03:47:23+05:30 IST
‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’ ఫేమ్ చరణ్ (Charan) హీరోగా.. కరిష్మా హీరోయిన్గా చరణ్ రోరి (Charan Rory) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం..
‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’ ఫేమ్ చరణ్ (Charan) హీరోగా.. కరిష్మా హీరోయిన్గా చరణ్ రోరి (Charan Rory) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రోరి’ (Rory). సిటిఎఫ్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో చిన్నా, పెద్ద ఆర్టిస్ట్లెందరో నటిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ యాక్షక్ విజువల్స్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. ఇన్విస్టిగేషన్ చేసే ఇంట్రస్టింగ్ పాత్రలో చరణ్ ఇందులో కనిపిస్తున్నారు. గెటప్ కూడా న్యాచురల్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే ఇటీవల వచ్చిన ‘సీతా రామం’ (Sita Ramam) చిత్రాన్ని షూట్ చేసిన లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లుగా చిత్రబృందం తెలుపుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది.
ఇక టీజర్ విడుదల సందర్భంగా చరణ్ రోరి మాట్లాడుతూ.. ఈ చిత్ర ఫస్ట్ లుక్కు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. హైదరాబాద్‌లో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కుర్రాడి కథ ఇది. అనుకోని పరిస్థితిల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ వెళ్ళాల్సివస్తుంది. అక్కడ కొంతమంది హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని.. వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా? లేదా? అనేది ఈ చిత్ర కథ. అసలు హైదరాబాద్ (Hyderabad)కి , పాకిస్థాన్ (Pakistan)కి మధ్య ఉన్న సంబంధం ఏమటనేది చిత్రంలోని ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా వుంటుంది.. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము.. అని తెలిపారు.