సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sita Ramam: ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ఖరారు

ABN, First Publish Date - 2022-05-07T00:37:04+05:30

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో స్వప్న సినిమా (Swapna Cinema) ప్రొడక్షన్ నెం7గా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా రామం’. ‘‘ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ’’ అనేది ట్యాగ్‪లైన్. యుద్ధం నేపధ్యంలో.. అందమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ (Ashwini Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) నిర్మిస్తున్నారు. సుమంత్ (Sumanth), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘ఓ సీత హే రామ’ ‪ని మే 9న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‪ని విడుదల చేశారు.


ఈ పోస్టర్ లో వర్షంలో హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ గొడుగు పట్టుకుని వయ్యారంగా నడిచి వస్తుండగా.. ఆమెని దుల్కర్ సల్మాన్ ఫాలో అవుతున్నారు. ఈ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. టైటిల్, గ్లింప్స్ తోనే భారీ అంచనాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. మ్యూజికల్ గానూ పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-05-07T00:37:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!