సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sita Ramam: సెన్సార్ పూర్తి..

ABN, First Publish Date - 2022-07-28T19:18:22+05:30

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman). ఆయన తాజాగా నటించిన సినిమా ‘సీతారామం’ (Sitaramam).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman). ఆయన తాజాగా నటించిన సినిమా ‘సీతారామం’ (Sitaramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెనార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడిపడిలేచే మనసు లాంటి విభిన్న కథా చిత్రాలతో అకట్టుకున్న దర్శకుడు  హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్‌గా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. 


వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న  థియేటర్స్ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘సీతారామం’ క్లీన్ యూ సర్టిఫికెట్‌ను పొందింది. దీన్ని బట్టి ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ వారు నిర్మించారు.  


ఇప్పటికే ‘సీతారామం’ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్..ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సీతారామం చిత్రాన్ని తమిళంలో థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు గానూ రైట్స్‌ను దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం లోనూ ఒకేసారి సీతారామం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 



Updated Date - 2022-07-28T19:18:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!