గాన తరంగమ్‌.. సోనూ నిగమ్‌!

ABN , First Publish Date - 2022-01-26T07:13:48+05:30 IST

సంగీత ప్రపంచంలో సూపర్‌ హిట్‌ గీతాలకు చిరునామాగా మారిన సోనూ నిగమ్‌కు పద్మశ్రీ దక్కింది. 48 ఏళ్ల సోనూ నిగమ్‌ హిందీ, తెలుగు, తమిళ, బెంగాళీ, తుళు... ఇలా పలు భాషల్లో దాదాపు ఐదు వేలకు...

గాన తరంగమ్‌.. సోనూ నిగమ్‌!

సంగీత ప్రపంచంలో సూపర్‌ హిట్‌ గీతాలకు చిరునామాగా మారిన సోనూ నిగమ్‌కు పద్మశ్రీ దక్కింది. 48 ఏళ్ల సోనూ నిగమ్‌ హిందీ, తెలుగు, తమిళ, బెంగాళీ, తుళు... ఇలా పలు  భాషల్లో దాదాపు ఐదు వేలకు పైగా పాటల్ని ఆలపించారు. సంగీత దర్శకుడిగా, రియాలిటీ షో న్యాయ నిర్ణేతగా బాలీవుడ్‌లో సోనూ విశేష ప్రాచుర్యం పొందారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. పలు ఆల్బమ్‌ రూపొందించి, సంగీత ప్రేమికుల్ని ఉర్రూతలూగించిన సోనూ.. 1973లో హర్యానాలోని ఫరిదాబాద్‌లో జన్మించారు. అలనాటి గాయకుడు మహ్మద్‌ రఫీని స్ఫూర్తిగా తీసుకొని చిత్రసీమలోకి అడుగు పెట్టిన సోనూ.. ‘మోడ్రన్‌ రఫీ’గా ఖ్యాతి గాంచారు. ‘తుమ్‌కొ పాయహై జైసా’ (ఓం శాంతి ఓం), ‘షబ్బా షబ్బా’ (దౌడ్‌), ‘సండేసే ఆతేహై’ (బోర్డర్‌), ‘తన్హాయీ’ (దిల్‌ చహతాహై), ‘ప్యార్‌ కీ ఏక్‌ కహానీ (క్రిష్‌), ‘కల్‌ హో నా హో..’ (కల్‌ హో నా హో), ‘నగడ నగడ’ (జబ్‌ వుయ్‌ మెట్‌), ‘గుజారీష్‌’ (గజినీ) ఇలా ఎన్నో వందల హిట్‌ గీతాలు సోనూ ఖాతాలో ఉన్నాయి. సోనూ గళంలో తెలుగు పాట  కూడా బాగానే పలికింది. ‘రావేనా చెలియా’ (జీన్స్‌), ‘హ్యాపీగా జాలీగా ఎంజాయ్‌ చేయ్‌రా’ (జయం మనదేరా), ‘నేస్తమా ఓ ప్రియ నేస్తమా’ (లాహిరి లాహిరి లాహిరిలో), ‘నిండు నూరేళ్ల సావాసం’ (ప్రాణం).. ఇవన్నీ రఽశోతల్ని అలరించిన గీతాలే. 

Updated Date - 2022-01-26T07:13:48+05:30 IST