బాలుగారు ‘ముద్దు మందారం’ అనేవారు: శ్రీలలిత భమిడిపాటి
ABN, First Publish Date - 2022-03-27T17:10:00+05:30
కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఉచితం.. కులం ఏదైనామ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080Mar 27 2022 @ 11:40AMహోంమీకు తెలుసా !..బాలుగారు ‘ముద్దు మందారం’ అనేవారు: శ్రీలలిత భమిడిపాటిఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750
రైమ్స్ పాడాల్సిన వయసులో లింగాష్టకం పాడేసింది...
పాట పాడి ఏకంగా ఎస్పీ బాలుతో ‘సుశీలమ్మలా పాడుతున్నావ్’ అనిపించుకుంది.
సంగీతమే కాదు.. సమాజ హితం కోసం సామాజిక అవగాహన చేపడుతోంది...
ఇదంతా ఎవరి గురించో తెలుసా? పాటల పోటీ అంటే... పక్కాగా వినిపించే శ్రీ లలితా భమిడిపాటి గురించి. తన సంగీత ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకుంది.
రైమ్స్ పాడాల్సిన వయసులో లింగాష్టకం పాడేసింది...
పాట పాడి ఏకంగా ఎస్పీ బాలుతో ‘సుశీలమ్మలా పాడుతున్నావ్’ అనిపించుకుంది.
సంగీతమే కాదు.. సమాజ హితం కోసం సామాజిక అవగాహన చేపడుతోంది...
ఇదంతా ఎవరి గురించో తెలుసా? పాటల పోటీ అంటే... పక్కాగా వినిపించే శ్రీ లలితా భమిడిపాటి గురించి. తన సంగీత ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకుంది.
నాన్న రాజశేఖర్ బ్యాంక్ ఉద్యోగి. అమ్మ సత్యవాణి గృహిణి. నేను పుట్టింది విజయవాడ. ఉద్యోగరీత్యా నాన్నకు బదిలీ అవుతుండడంతో వివిధ ప్రాంతాల్లో పెరిగాను. అమ్మనాన్న ఇద్దరూ సింగర్సే. ఇద్దరికీ కర్ణాటిక్ క్లాసికల్ మీద పట్టుంది. మా అమ్మమ్మ, వాళ్ల అక్కచెల్లెళ్లు కర్ణాటక సంగీతంలో వీణా, వయోలిన్, మృదంగంలో లెక్చరర్స్‌గా పని చేశారు. అలా మా కుటుంబంలో సంగీతం ఇమిడి ఉంది. అమ్మాయి పుడితే ఎలాగైనా గాయని చేయాలని చిన్నతనంలోనే అమ్మవాళ్లు అనుకున్నారట. స్టేజ్ ఫియర్ ఉండకూడదని ఎనిమిది నెలల వయసులోనే నన్ను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మూడున్నరేళ్ల ఒక షోకి వెళితే.. ఆ వేదికపై నన్ను ఒక రైమ్ చెప్పమన్నారు. నేను రైమ్ పాడకుండా లింగాష్టకం పాడాను. అమ్మతో సహా వేదికపై ఉన్నవారంతా షాక్ అయ్యారు. చిన్నప్పుడు అమ్మ పూజ చేసే సమయంలో ఒళ్లో కూర్చోబెట్టుకునేది. అమ్మ పాడే పాటలు విని నేర్చుకున్నా. నాన్న హిందీ పాటలు ఎక్కువ పాడుతుంటారు. అలా హిందీ పాటలు కూడా నేర్చుకున్నా. అయితే చిన్నతనంతో స్కూల్‌కి ఎక్కువగా వెళ్లేదాన్ని కాదు. షోల్లో పాల్గొవడం వల్ల అటు ఇటు తిరగడంతో స్కూల్‌కి వెళ్లడం కుదిరేది కాదు. అప్పుడప్పుడూ ప్రత్యేక క్లాస్‌లకు వెళ్లేదాన్ని. అయినా పదో తరగతిలో 9.8% ఉత్తీర్ణత సాధించా. ప్రస్తుతం మ్యూజిక్‌లో డిప్లమో పూర్తయింది. శాస్ర్తీయ సంగీతంలో బీఏ చేస్తున్నా.
సంగీతంలో నా మొదటి గురువులు అమ్మానాన్న. నాన్న సినిమా పాటలు, అమ్మ. అమ్మమ్మ క్లాసికల్ పాటలను నేర్పించారు. ఆ తర్వాత మా అమ్మమ్మవాళ్ల సోదరి లంకా విజయలక్ష్మీగారి దగ్గర ఐదేళ్లు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. ప్రస్తుతం మోదుమూడి సుధాకర్‌గారి దగ్గర నేర్చుకున్నా. త్యాగరాజ శిష్యపరంపరలో మా గురువు ఐదోవారు. నేను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి విజయవాడలో ఉంటున్న గురువుగారి నుంచి ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతున్నా.
నా వెన్నంటే ఉంది...
ఆరేళ్ల వయసులో సరిగమప ‘లిటిల్ చాంప్స్’(2008), ఆ తర్వాత ‘సంగీత మహాయుద్ధం’, ‘స్వరనీరాజనం’, ‘పాడుతా తీయగా’ ‘బోల్ బేబీ బోల్’, సూపర్ సింగర్స్, ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ ఇలా చాలా షోల్లో పాడాను. ‘బోల్ బేబీ బోల్’లో రన్నర్‌గా, మెంటర్‌గా, రెండు సీజన్‌లకు యాంకర్‌గా చేశా. తొమ్మిదేళ్ల వయసులో పాడుతా తీయగా కోసం ప్రయత్నించా. అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత రెండేళ్లకు అవకాశం వచ్చింది. ఆ వేదికపై అడుగుపెట్టగానే ఎస్.పి.బాలుగారిని చూసి భయపడ్డాను. కానీ ఆయన పాడటానికి వచ్చిన పిల్లలు అందరినీ దగ్గరకు తీసుకుని అన్నీ వివరించేవారు. బాలుగారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఆయన ముద్దుగా ‘ముద్దు మందారం’ అనిపిలిచేవారు. ‘సరిగమప’లో పాడిన 30కుపైగా పాటలు నాన్న నేర్పినవే. సంగీత ప్రయాణంలో మొదలైనప్పటి నుంచీ ప్రతి క్షణం అమ్మ నా వెన్నంటే ఉంది. సింగర్‌ని చేయాలని నా తల్లిదండ్రులు అనుకోవడం ఒకటైతే... వాళ్ల ఆశలకు అనుగుణంగా నేను అదే దారితో వెళ్లడం, వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడం గొప్ప అనుభూతి.
ఆ పాటతో మంచి గుర్తింపు..
టీవీ సంగీత పోటీల్లో ఎన్నో పాటలు నాకు గుర్తింపు తెచ్చాయి. ‘బోల్ బేబీ బోల్’లో మలయాళ ‘భావయామి’ పాటను కల్పనగారు పాడారు. ఆమె పాడిన తీరు చూసి షాకయ్యా. కోటిగారు పిలిచి తర్వాతి షోలో నువ్వే పాడాలన్నారు. 13 నిమిషాల ఆ పాట పాడటం చాలా కష్టం. కీబోర్డ్ ప్లేయర్ సాయికుమార్ పాట నేర్పించగా నెల రోజులు ప్రాక్టీస్ చేసి పాడాను. ఆ రోజు కోటిగారు అభినందనలు మరచిపోలేను. అదే పాటను సోనునిగమ్, శ్రేయాగోషాల్‌గారు మెచ్చుకుని వీడియో షేర్ చేశారు. చిన్న ప్రయత్నంగా పాడిన ‘హరివరాసనం’ పాట బాగా పాపులర్ అయింది. బాలుగారు, చిత్రగారు లాంటి వారితో వేదికపై పాడే అవకాశం రావడం నా అదృష్టం.
పోటీతో పరుగు తీయను...
ప్రస్తుతం ఏ రంగంలో అయిన పోటీ తప్పనిసరి. నేను పోటీ పడి పరుగులు తీయను. సాధనతోనే ముందెకెళ్తా.చిన్నతనం నుంచి అమ్మానాన్న నాకు ఇవే నేర్పించారు. ఆ తర్వాత ‘పోటీతో పరుగుతు తీయవద్దని, ఒకరితో పోల్చి చూసుకోవద్దని బాలుగారు చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నా. సక్సెస్ సాధన ఒకటే మార్గం. అదే దార్లో వెళ్తున్నా.
స్ఫూర్తి వీరే..
కర్ణాటిక్ సంగీతంలో బాలమురళీ కృష్ణగారు, హింధూస్థాన్‌లో కౌషికి చక్రవర్తిగారు నాకు స్ఫూర్తి. నా జర్నీలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి మంచి విషయాన్ని గ్రహించి ఫాలో అవుతాను.
చిన్నతనంలో అమ్మమ్మ, అమ్మ నేర్పించినప్పుడు అంతగా దీని వాల్యూ నాకు తెలియలేదు. ఇప్పుడు మా గురువుగారు చెబుతుంటే సంగీతంలో లోతుగా ఆలోచిస్తుంటే దీని గొప్పతనం తెలుస్తుంది. అందుకే ఎంఏ మ్యూజిక్ పూర్తయ్యాక ఒక ఇన్‌స్టిట్యూట్ కట్టి కర్ణాటక సంగీతం నేర్పించాలనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ప్రారంభం కావడానికి ఇంకో ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుతానికి నాకున్న గోల్ ఇదే!
సాధనే ముఖ్యం...
సంగీతం అంటే మహాసముద్రం. అది పూర్తిగా ఎవరికీ రాదు. నిత్యవిద్యార్ధిలా నేర్చుకుంటూనే ఉండాలి. ఈ రంగంలో ఎదగాలి, గుర్తింపు రావాలి అంటే నిత్యం సాధన చేయాలి. ‘మనకు వచ్చేసింది కదా’ అనుకుంటే దెబ్బతింటాం. ‘శాస్త్రియ సంగీత నేర్చుకుంటే సంగీత ప్రపంచంలో ఎలాంటి పాటైనా పాడగలరు. అందులో ఉన్న సీక్రెట్స్ అలాంటివి. శాస్త్రియ సంగీతం అమ్మలాంటిదని, ‘నేర్చుకోవడం కంటే దానిని సాధన చేయడం ముఖ్యమని బాలుగారు తరచూ చెబుతుండేవారు. నేను ఆయన చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నా. పూర్తిస్థాయి శాస్త్రియ సంగీత కచేరీ చేయాలని బాలుగారికి కోరిక. కానీ అది అంత సులభం కాదనేవారు. ఆ కోరిక తీరకుండానే సంగీత రంగాన్ని వదిలివెళ్లిపోయారు. ఆ పూర్తిస్థాయి శాస్త్రీయ సంగీత కచేరీ చేసేందుకు నేను కృషి చేస్తాను.
గుర్తింపు అంత ఈజీ కాదు..
శాస్త్రీయ సంగీతంలో మృదంగం, వయొలిన్, సింగింగ్ ఏది నేర్చుకోవాలన్నా 8 నుంచి 15 ఏళ్లు సాధన చేయాలి. అప్పుడు గానీ ఆ సంగీతంలో ఒక లెవల్‌కి రాలేరు. అలాకాకుండా షాట్‌కట్‌లో వెళితే ఫలితం కూడా అలాగే ఉంటుంది. సరళీ స్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు, కీర్తనలు, కృతులు, మనోధర్మం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వెళ్లాలి. వీటి మీద ఎంత పట్లు సాధించిన ఒక్కోసారి గుర్తింపు దక్కదు. ఎందుకంటే శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారే తక్కువైపోయారు. దీనినే జీవనాధారం చేసుకున్నవారికి ఆదాయం ఉండదు. శాస్ర్తియ సంగీతాన్ని కాస్త తక్కువగా చూస్తున్నారు. ఈ పద్దతిని మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. మంచి జరగాలని కోరుకుంటున్నా.
కొత్త ప్రయోగాలు చేస్తా...
చిన్నప్పటి నుంచి ఏ విషయానైనా క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం అలవాటు. నచ్చితే టక్కున పట్టేస్తా. ఒకటి నేర్చుకోవాలి అనుకున్నానంటే అది అయిపోవాల్సిందే. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఆల్బమ్స్, డివోషనల్ సాంగ్స్ పాడుతూ నాలోని మరో టాలెంట్‌ను బయటపెట్టడానికి ‘యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. అందులో నాకు నచ్చిన పాటల్ని కవర్స్, మెడ్లీగా చేస్తుంటాను. ఇప్పుడు ఆడియన్స్ అభిరుచి మేరకు అందులో పాటలు చేస్తున్నా. నా జానర్ క్లాసికల్ కాబట్టి నా సబ్‌స్ర్కైబర్స్ అంతా క్లాసికల్‌నే ఇష్టపడతారు. ఒపేరా వెస్ట్రన్ స్టైల్లో కొత్త ప్రయోగాలు చేయానుకుంటున్నా. నా వీడియో చూసి యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ సంగీతాన్ని ఆశ్రద్ధ చేయకూడదని అటువైపు వెళ్లలేదు.
మారుమూల ప్రాంతాల ప్రతిభ బయటికొస్తుంది..
కొన్నేళ్ల క్రితం టెక్నాలజీ, మీడియా వివిధ మాధ్యమాలు అందుబాటులో ఉండేవి కాదు. పెరుగుతున్న టెక్నాలజీతో సంగీతం మీద ఆసక్తి ఉండి ప్రతిభను బయటపెట్టాలనుకునేవారికి చాలా వేదికలు అందుబాటులో ఉన్నాయి. అలా వచ్చి నిరూపించుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే ఒకప్పుడు సింగర్స్ అంటే బాలు, మనో, సుశీలమ్మ, జానకమ్మ, చిత్ర ఇలా కొన్ని పేర్లే వినిపించేవి. వారికి ఎక్కువ అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు సీంగీత రంగంలో సంఖ్య పెరిగింది. పోటీ అంతకుమించి! అయితే అందరికీ సినిమాల్లో అవకాశం దక్కకపోవచ్చు. వివిధ వేదికలపై తమ ప్రతిభను చూపే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా షోల్లో పాల్గొనే అవకాశం వస్తుంది.
నాలో ఉన్న మరో టాలెంట్..
చిన్నప్పటి నుంచీ ప్రతి విషయాన్ని గమనిస్తాను. అలా గమనించి నేర్చుకున్నదే మిమిక్రీ, ఇమిటేటింగ్. ఒకసారి సరదాగా గీతమాధురిగారి వాయిస్ ఇమిటేట్ చేశాను. అది బాలుగారి వరకూ వెళ్లింది. అలా నన్ను హైలైట్ చేసేశారు. సునీత, మాళవిక వంటి సింగర్‌లను ఇమిటేట్ చేస్తాను.
సినిమా అవకాశాలు రాలేదు..
నాకు చాలా మొహమాటం ఎక్కువ. ఏదీ అడగడం చేత కాదు. అందుకే ఇప్పటివరకూ సినిమా పాటల అవకాశం రాలేదు. సినిమా పాట అని తెలియక కొన్ని పాటలు పాడానేమో కానీ ఇది సినిమా పాట అని నా దగ్గరకు వచ్చిన అవకాశాలు అయితే లేవు. నేను కూడా సంగీత దర్శకులను ఎవరినీ అప్రోచ్‌కాలేదు. కారణం నేను ఎక్కువగా హైదరాబద్‌లో లేకపోవడం. ఇప్పుడు సినిమా పాటల కోసం ప్రయత్నాలు చేస్తా.
సోషల్ అవేర్‌నెస్ కోసం..
సింగింగ్‌తోపాటు సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటా. ఈషా ఫౌండేషన్‌కు వలంటీర్‌గా పనిచేస్తాను. కావేరి కాలింగ్, సేవ్ సాయిల్ కార్యక్రమాలకు క్యాంపెయిన్ చేస్తుంటా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో సేవ్ సాయిల్ క్యాంపెయిన్ చాలా అవసరం. 30,40 ఏళ్లల్లో తినడానికి తిండి దొరికే పరిస్థితి ఉండదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘సేవ్ సాయిల్’ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలి. దీని మీద అవగాహన కల్పించడానికి కొన్ని పాటలు చేస్తున్నాము.
- ఆలపాటి మధు
Updated Date - 2022-03-27T17:10:00+05:30 IST