సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Lipsika: టాలీవుడ్‌ సింగర్‌ ఇంట్లో విషాదం

ABN, First Publish Date - 2022-07-08T05:30:00+05:30

గాయని లిప్సికకు పితృ వియోగం కలిగింది. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని లిప్సిక ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ‘‘మీరు లేని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు పప్పా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాయని లిప్సికకు (Lipsika)పితృ వియోగం కలిగింది. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. (Singer lipsika father is no more)ఈ విషయాన్ని లిప్సిక ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ‘‘మీరు లేని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు పప్పా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వార్త తెలుసుకున్న స్నేహితులు, తోటి గాయనీగాయకులు, సంగీత దర్శకులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. లిప్సికకు ధైర్యం చెప్పారు. (Lipsika father passed away)


సంగీతం మీదున్న మక్కువతో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో స్థానం సంపాదించి లిప్సిక తన ప్రతిభను చాటారు  ఎస్‌.పి.బాలు  ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇప్పటి వరకూ 300లకు పైగా పాటలు పాడారు. ‘నిన్ను చూసి పడిపోయా ఆన్‌ ద స్పాట్‌’ (టెంపర్‌), ‘ఓసి ప్రేమ రాక్షసి’(కొత్తజంట), ‘బుగ్గంచున్న ఎరుపును పెంచే’ (జవాన్‌), ‘ఐ జస్ట్‌ లవ్‌ యు బేబి’ (ప్రేమకథా చిత్రమ్‌) వంటి సూపర్‌ హిట్‌ పాటల్ని లిపిక్స ఆలపించారు. (Tollywood Singer lipsika)







Updated Date - 2022-07-08T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!