గాయకుడు కె.కె. అకాల మరణం బాధాకరం : Pawan Kalyan

ABN , First Publish Date - 2022-06-01T19:31:08+05:30 IST

ఈరోజు (జూన్ 1) ప్రముఖ గాయకుడు కె.కె (K.K) (కృష్ణ కుమార్ కున్నత్ Krishnakumar Kunnath) కన్నుమూశారు. ఆయన వయసు 53. ఇంత చిన్న వయసులో హటాత్తుగా మృతి చెందటం సంగీత ప్రియులకు తీరని లోటు.

గాయకుడు కె.కె. అకాల మరణం బాధాకరం : Pawan Kalyan

ఈరోజు (జూన్ 1) ప్రముఖ గాయకుడు కె.కె (K.K) (కృష్ణ కుమార్ కున్నత్ Krishnakumar Kunnath) కన్నుమూశారు. ఆయన వయసు 53. ఇంత చిన్న వయసులో హఠాత్తుగా మృతి చెందటం సంగీత ప్రియులకు తీరని లోటు. కోల్‌కతాలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. దాంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చేందినట్టు వైధ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కె.కె మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 


ఈ క్రమంలో సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సంతాపాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిలో.."కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ (Khushi) చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ (Ye Mera Jaha) గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. 


‘జల్సా’ (Jalsa)లో మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా’ (My Heart Is Beating), ‘బాలు’ (Balu) ‘ఇంతే ఇంతింతే’, ‘జానీ’ (Jhony)లో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు... సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి"..అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Updated Date - 2022-06-01T19:31:08+05:30 IST

Read more