Simbu: దయచేసి అలాంటివి అడగొద్దు.. ఫ్యాన్స్‌కి శింబు రిక్వెస్ట్

ABN , First Publish Date - 2022-11-11T16:11:28+05:30 IST

కోలీవుడ్‌ (Kollywood)తోపాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు శింబు..

Simbu: దయచేసి అలాంటివి అడగొద్దు.. ఫ్యాన్స్‌కి శింబు రిక్వెస్ట్

కోలీవుడ్‌ (Kollywood)తోపాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు శింబు (Simbu). అందుకే ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా విడుదల అవుతుంటుంది. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వెందు తణిందదు కాడు’ (Vendhu Thaninthathu Kaadu). తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ (The Life Of Muthu). సెప్టెంబర్ 17న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర చిత్రం అర్థ శతదినోత్సవ వేడుకలను తాజాగా నిర్వహించారు.


ఈ వేడుకల్లో పాల్గొన్న శింబు మాట్లాడుతూ.. ‘‘ఇది తమిళ సినిమాకు స్వర్ణయుగంలా భావిస్తున్నాను. ‘విక్రమ్‌, పొన్నియిన్‌ సెల్వన్‌, లవ్‌టుడే’ వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. మంచి కథ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘వెందు తణిందదు కాడు’ విడుదలకాక ముందు కొంత భయం ఉండేది. అటు కమర్షియల్‌, ఇటు హీరోయిజం లేకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కించారు. కానీ.. ప్రేక్షకుల ఘన విజయం చేకూర్చి పెట్టడం చూసి నిజంగానే ఆశ్చర్యపోయాం. ఇందులో తెరపై ముత్తుగానే ఉండాలన్న లక్ష్యంతో ఎంతగానే శ్రమించి నటించాను. నిర్మాత, దర్శకుడు కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తారు. కానీ, ప్రేక్షకులు పదే పదే అప్‌డేట్‌ అడిగితే తప్పుటడుగు వేసే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి కొత్త చిత్రాల అప్‌డేట్‌ గురించి ప్రస్తావించవద్దు’ అని అభిమానులకు విఙ్ఞప్తి చేశారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాత ఐసరి గణేశన్‌, దర్శకుడు గౌతమ్‌ మేనన్‌, హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి, హీరోయిన్‌ సిద్ధి ఇద్నానీ, సినీ నటి రాధిక , దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-11-11T16:11:28+05:30 IST