బర్త్‌డే లుక్‌లో ‘సిద్ధ’

ABN , First Publish Date - 2022-03-28T06:25:24+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే....

బర్త్‌డే లుక్‌లో ‘సిద్ధ’

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం చరణ్‌ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసి, శుభాకాంక్షలు అందజేసింది. ఈ చిత్రంలో చరణ్‌ సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. కాజల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఇటీవలే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో చరణ్‌ అలరించిన సంగతి తెలిసిందే. మరోవైపు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి చెప్పిన కథకు చరణ్‌ ఓకే చేప్పేశారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుంది. 


Updated Date - 2022-03-28T06:25:24+05:30 IST