Siddharth: అప్పుడే నటనకు స్వస్తి చెబుతా!
ABN , First Publish Date - 2022-05-14T22:17:50+05:30 IST
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’తో హీరోగా పరిచయమయ్యారు సిద్థార్థ్. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఆట’, ‘‘180’, ‘ఓయ్’ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ చిత్రాలతో బిజీ అయిన ఆయన తెలుగు చిత్రాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ శర్వానంద్ ‘మహా సముద్రం’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించారు.

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’తో హీరోగా పరిచయమయ్యారు సిద్థార్థ్ (Siddharth). ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఆట’, ‘‘180’, ‘ఓయ్’ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ చిత్రాలతో బిజీ అయిన ఆయన తెలుగు చిత్రాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ శర్వానంద్ ‘మహా సముద్రం’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించారు. మధ్యమధ్యలో సినిమాల నిర్మాణమూ చేశారు. హిందీలో ‘అవల్’(Aval) (ది హౌస్ నెక్ట్స్ డోర్) చిత్రం తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. తాజాగా ‘ఎస్కేప్ లైవ్' (escaype live) అనే హిందీ వెబ్ సిరీస్ చేశారు. సిద్థార్థ్ కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ నెల 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ర్టీమింగ్ కానుంది. ఆరేళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిద్ధార్థ్ (Siddharth)
‘‘కెరీర్ బిగినింగ్ నుంచి ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లోనే కనిపించాను. దానితో నను ఢిల్లీ కుర్రాడిని అనే విషయాన్నే మర్చిపోయారు. హిందీ బాగా మాట్లాడతాను కాబట్టి ఎగ్జైటింగ్ క్యారెక్టర్స్ వచ్చిన ప్రతిసారీ హిందీ చిత్రాల్లో నటించడం అలవాటుగా మారింది. సిద్థార్థ్ కుమార్ చెప్పిన ‘ఎస్కేప్ లైవ్’ కథ నచ్చింది. వెంటనే ఓకే చేశా. ఇందులో కంటెంట్ మోడరేటర్‌గా నటిస్తా. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన పాత్రలు దక్కినంత కాలం సినిమాల్లో నటిస్తాను. ఆ అవకాశాలు లేనప్పుడు నటనకు స్వస్తి పలికి వేరే పని చూసుకుంటాను’’ అని సిద్థార్థ్ చెప్పారు.