సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వరల్డ్ నెం.3 గా నేచురల్ స్టార్ సినిమా

ABN, First Publish Date - 2022-01-27T18:11:52+05:30

నేచురల్ స్టార్ నానీ, టాలెంటెడ్ స్టార్ సాయిపల్లవి జంటగా.. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. బెంగాలీ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. టాలీవుడ్ లో మంచి వసూళ్లు తెచ్చుకున్న ఈ సూపర్ హిట్ మూవీ.. నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నానీ, టాలెంటెడ్ స్టార్ సాయిపల్లవి జంటగా.. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. బెంగాలీ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. టాలీవుడ్ లో మంచి వసూళ్లు తెచ్చుకున్న ఈ సూపర్ హిట్ మూవీ.. నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయింది. థియేటర్ప్ లో ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుందో ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ లభించింది. అత్యధికంగా వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుని,  మరో అరుదైన రికార్డు ను కూడా నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ చిత్రానికి దక్కని అరుదైన రికార్డు ‘శ్యామ్ సింగరాయ్’ సొంతమైంది. 


స్ట్రిమింగ్ అయిన మొదటి మూడురోజుల్లోనే దాదాపు 3.6 వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుంది ‘శ్యామ్ సింగరాయ్’. ఆ వారం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన సినిమాలు, వెబ్ సిరీసుల్లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియా మూవీగా నిలిచింది. ఇప్పటి వరకూ ఏ సౌత్ మూవీ కూడా ఈ స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 3 లో ‘శ్యామ్ సింగారాయ్’ చిత్రం నిలవడం అరుదైన ఘనతగా చెప్పొచ్చు. థియేటర్స్ తో పాటు, ఓటీటీలోనూ ఒకే స్థాయిలో ఆదరణ దక్కించుకున్న చిత్రంగానూ శ్యామ్ సింగరాయ్ నిలిచింది.  

Updated Date - 2022-01-27T18:11:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!