అమ్మగా అక్కినేని అమల.. అమ్మ పాటే ఆధారమంటోన్న దర్శకుడు
ABN , First Publish Date - 2022-01-29T02:15:58+05:30 IST
సీనియర్ నటి అమల, యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెలుగులో ‘ఒకే ఒక జీవితం’, తమిళంలో ‘కణం’ పేరుతో రూపొందిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అమ్మ పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట ప్రతి ఒక్కరి గుండెలను పిండేసేలా

సీనియర్ నటి అమల, యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెలుగులో ‘ఒకే ఒక జీవితం’, తమిళంలో ‘కణం’ పేరుతో రూపొందిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అమ్మ పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట ప్రతి ఒక్కరి గుండెలను పిండేసేలా ఉంది. జేక్స్ బిజోయ్ సంగీత స్వరాలు సమకూర్చగా, ఎమోషనల్‌గా హృదయాన్ని హత్తుకునేలా సాగుతుంది. సిధ్ శ్రీరామ్ తన మనోహరమైన గాత్రంతో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్ళేలా చేశారు. డ్రీమ్ వారియర్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటించారు. రీతూవర్మ హీరోయిన్. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో సాగే ఫిక్షన్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందింది.
తల్లి జీవించివున్న సమయంలో ఏమాత్రం పట్టించుకోని కొడుకు... ఆమె దూరమైన తర్వాత అమ్మ ప్రేమకోసం పరితపించే కుమారుడుగా శర్వానంద్ నటించారు. ఈ చిత్ర కథకు అమ్మ పాటే ఆధారమని దర్శకుడు శ్రీకార్తిక్ అంటున్నారు. ఈ పాట గురించి దర్శకుడు మాట్లాడుతూ.. గతంలో తమిళ ‘మన్నన్’ చిత్రంలోని ‘అమ్మ’ పాట, ఆ తర్వాత ‘వేలైయిల్లా పట్టాదారి’ చిత్రంలోని ‘అమ్మా.. అమ్మా...’ అనే పాటల తర్వాత ఈ చిత్రంలోని అమ్మ పాటకు మంచి ఆదరణ లభించిందన్నారు. నిజ జీవితంలో అమ్మను కోల్పోయిన వారికి ఈ పాట ఒక జోల పాటగా ఉంటుందని, మిగిలిన వారికి ఆత్మవిశ్వాసం కలిగించేలా ఉంటుందని వివరించారు.