సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shravana bhargavi: తగ్గింది.. ఎట్టకేలకు పాటను తీసేసింది!

ABN, First Publish Date - 2022-07-24T00:31:13+05:30

సింగర్‌ శ్రావణ భార్గవి.. తన యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను తొలగించారు. అన్నమాచార్యుల పెదకుమారుడు పెద తిరుమలాచార్యులు రాసిన ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ కీర్తనతో గాయని శ్రావణ భార్గవి చిత్రీకరించిన ఫ్యూజన్‌ వీడియో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగర్‌ శ్రావణ భార్గవి(Shravana bhargavi).. తన యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను తొలగించారు. అన్నమాచార్యుల పెదకుమారుడు పెద తిరుమలాచార్యులు రాసిన ‘ఒకపరి కొకపరి ఒయ్యారమై’ (Annamayya controversy)కీర్తనతో గాయని శ్రావణ భార్గవి చిత్రీకరించిన ఫ్యూజన్‌ వీడియో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే! అన్నమాచార్యుల వంశస్థులు ఆ పాట చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేసి, యూట్యూబ్‌ నుంచి తొలగించమని కోరగా ఆమె తిరస్కరించారు. అందులో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కేది కాదని, అందుకే ఆ వీడియోను తొలగించేది లేదని, పైగా చేతనైంది చేసుకోమని ఆమె అన్నమయ్య వంశస్థులతో అహంకారంగా మాట్లాడారు. దీనితో తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవిపై తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు తిరుపతిలో నిరసనలు వ్యక్తం చేశారు. (Shravan bhargavi Deleted okapari song)


‘తగ్గేదేలే’ అన్న సింగర్‌ శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించారు. దైవాజ్ఞ ఉంటే అది తప్పకుండా ఉంటుందన్న ఆమె ఇప్పుడు ఆ వీడియో తొలగించడం పట్ల తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్థులు, శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-07-24T00:31:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!