Arrtham: శ్రద్దా దాస్‌కు టర్నింగ్ పాయింట్ సినిమా..

ABN , First Publish Date - 2022-08-20T03:14:38+05:30 IST

హీరోయిన్ శ్రద్దా దాస్ (Shraddha Das) ‘మాయ’ (Maaya) అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘అర్థం’ (Arrtham). మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా

Arrtham: శ్రద్దా దాస్‌కు టర్నింగ్ పాయింట్ సినిమా..

హీరోయిన్ శ్రద్దా దాస్ (Shraddha Das) ‘మాయ’ (Maaya) అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘అర్థం’ (Arrtham). మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి (Manikanth Thallaguti) దర్శకత్వంలో..  డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ (Radhika Srinivas) నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. సెప్టెంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. 


ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే  ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వి.యఫ్.ఎక్స్ ఇంపార్టెంట్. డిఓపి పవన్‌గారు నన్ను చాలా అందంగా చూయించారు. దర్శకుడు మణికాంత్‌గారు, మరియు  నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు.ఈ మూవీ‌లో గ్లామర్ రోల్‌లో సైకియాట్రిస్ట్‌గా నటించాను. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, అలాగే మంచి టీమ్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. (Arrtham Teaser Launch)


చిత్ర నిర్మాత శ్రీనివాస్ (Srinivas) మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందు నేను తీసిన ‘నాటకం’ సినిమాకు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. వియఫ్‌ఎక్స్‌లో అనుభవం ఉన్న మణికాంత్ తన ప్రొఫెషన్‌ను పక్కనపెట్టి డైరెక్టర్ కావాలనే ప్యాషన్‌తో.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథ‌ని వినిపించారు. కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని కోవిడ్ టైమ్‌లో స్టార్ట్ చేశాము. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ‘ఖైదీ’కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి.. మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. ఇందులో నటించిన వారందరూ ఆర్టిస్ట్‌ల్లా కాకుండా ఫ్యామిలీ మెంబెర్స్‌లా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు  పూర్తి చేసి సెప్టెంబర్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము...’’ అని తెలుపగా.. చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని నిర్మాత రాధికా శ్రీనివాస్ అన్నారు.


చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్‌పై ఉండడానికి మా నాన్నే స్ఫూర్తి. ‘అర్థం’ అంటే ఏమిటని అనుకుంటున్నారు. కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించడం జరిగింది. నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్‌గారు సినిమా నిర్మించారు. సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడ్డారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటికంటే  శ్రద్దా దాస్‌కు ఈ  సినిమా మంచి టర్నింగ్ అవుతుంది. సినిమాకు పని చేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు గొప్ప విజయం చేకూర్చాలని ప్రేక్షకులను కోరుతున్నాను..’’ అని అన్నారు. ‘‘కొంతమంది నిర్మాతలు మంచి కాన్సెప్ట్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని  తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ‌కి మంచి పేరు తెస్తాయి.. అలాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించే నిర్మాత  శ్రీనివాస్‌గారని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి’’ అని అన్నారు నటుడు, మాస్టర్ మహేంద్ర.




Updated Date - 2022-08-20T03:14:38+05:30 IST