సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Godfather: గాడ్ ఫాదర్ మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్

ABN, First Publish Date - 2022-10-06T16:37:52+05:30

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటిది మరి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా అంటే  తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటిది మరి అతని సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather) పండగ రోజు విడుదల అయింది అంటే, మరి అంతకు రెండింతల వాతావరణం ఉండాలి కదా! మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ (Godfather first day collections) ఎలా వచ్చాయో చూడండి. మామూలుగా చిరంజీవి సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ (Box office)ని ఉర్రూతలూగించాలి, అలాంటిది మాటినీ కి ఫుల్ అవుతున్నాయి, మొదటి ఆట పరవాలేదు, రెండో ఆట ఫుల్ అయ్యాయి, సినిమా పరవాలేదు నిలుస్తుంది ఇలాంటి మాటలు వినపడుతున్నాయి.  ఇప్పుడు ఈ 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మొదటి రోజు సుమారుగా 13 కోట్ల షేర్ (13 crore share world wide) వరల్డ్ మొత్తం వచ్చింది. చిరంజీవి సినిమాకి ఇది చాలా తక్కువ. రెండో రోజు కలెక్షన్స్ బాగుంటాయి అని అందరూ అనుకుంటున్నారు. సినిమా కి అయ్యే ఖర్చు 90 కోట్ల వరకు అయింది, చాల ఏరియాస్ లో స్వంతం గానే విడుదల చేసుకున్నారు. మలయాళం సినిమా 'లూసిఫెర్' కి రీమేక్ గా ఈ 'గాడ్ ఫాదర్' సినిమా చేసారు.  హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇందులో ఒక కీలక పాత్రలో నటించాడు. 

నైజాం  సుమారు 3.3 కోట్లు వసూల్ చెయ్యగా, సీడెడ్ 3.2 కోట్లు వసూల్ చేసింది. 

ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు 

వెస్ట్ గోదావరి 58 లక్షలు 

ఈస్ట్ గోదావరి: 1.60 కోట్లు 

గుంటూరు: 1. కోట్లు 

కృష్ణ: 72.5 లక్షలు 

నెల్లూరు: 57 లక్షలు 


మొత్తం షేర్: 12.98 కోట్లు 

Updated Date - 2022-10-06T16:37:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!