Shekhar Kapur: ‘పానీ’ ప్రాజెక్టు కోసం నిర్మాతలతో చర్చలు
ABN, First Publish Date - 2022-10-30T23:49:14+05:30
భారతదేశం గర్వంచదగ్గ దర్శకుల్లో శేఖర్ కపూర్ (Shekhar Kapur) ఒకరు. గతంలో గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా అవార్డులను గెలుచుకున్నాడు. అతడి కలల ప్రాజెక్టు ‘పానీ’ (Paani). శేఖర్ ఎన్నో ఏళ్లుగా ఈ సినిమాను
భారతదేశం గర్వంచదగ్గ దర్శకుల్లో శేఖర్ కపూర్ (Shekhar Kapur) ఒకరు. గతంలో గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా అవార్డులను గెలుచుకున్నాడు. అతడి కలల ప్రాజెక్టు ‘పానీ’ (Paani). శేఖర్ ఎన్నో ఏళ్లుగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అనేక కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలెక్కడం లేదు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ పలువురు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నాడు.
అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది లోగా ‘పానీ’ పట్టాలెక్కుతుందని శేఖర్ కపూర్ తెలిపాడు. ‘‘ఈ ప్రప్రంచంలో ప్రతి నమ్మకానికి నీళ్లే కీలకం. ‘పానీ’ అనేది అద్భుతమైన స్క్రిఫ్ట్. ఈ స్క్రిఫ్ట్‌లో ప్రేమతో సహా చాలా పాత్రలు ఉన్నాయి. అనేక బంధాలకు చోటు ఉంది. ప్రేమ కథకు నీరే కీలకం. అన్ని అనుకున్నట్టు కుదిరితే వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ మూవీని ఇంగ్లిష్‌లో కూడా షూట్ చేస్తాం’’ అని శేఖర్ కపూర్ తెలిపాడు. అతడు తాజాగా ‘వాట్స్ లవ్ గాట్ టు డు విత్ ఇట్’ (Whats Love Got to Do With It)కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పైనే దృష్టి సారించానని శేఖర్ చెప్పాడు. ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తుందన్నాడు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఈ చిత్రం బ్రిటన్‌లో వచ్చే ఏడాది జనవరి 27న రిలీజ్ కానుంది. ఇక ‘పానీ’ విషయానికి వస్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణంతో ఈ సినిమా అటకెక్కింది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ కూడా మూవీని నిర్మించేందుకు ఆసక్తి చూపకపోవడంతో పూర్తిగా ఆగిపోయింది.