శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలా ఉంటాడు

ABN , First Publish Date - 2022-10-03T05:57:57+05:30 IST

‘‘స్వాతిముత్యం’ చూశాక ప్రేక్షకులు థియేటర్‌ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఇప్పటిదాకా ఎవరూ స్పృశించని ఒక కొత్త అంశాన్ని...

శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలా ఉంటాడు

‘‘స్వాతిముత్యం’ చూశాక ప్రేక్షకులు థియేటర్‌ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఇప్పటిదాకా ఎవరూ స్పృశించని ఒక కొత్త అంశాన్ని ఈ సినిమాలో చూపించాం’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. గణేష్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబరు 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ


హీరో పాత్ర అమాయకంగా  ఉంటుంది. అందుకే ‘స్వాతిముత్యం’ అనే టైటిల్‌ పెట్టాం. శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలా ఉంటాడు. ‘డీజే టిల్లు’ తర్వాత తెలుగులో ఆ స్థాయి ఎంటర్టైన్‌మెంట్‌ని అందించే చిత్రం ఇదే. 


లక్ష్మణ్‌ తను అనుకున్నది చాలా కాన్ఫిడెంట్‌గా తీశాడు. హీరోయిన్‌ పాత్రకు చక్కగా నప్పుతుందని వర్ష బొల్లమ్మను ఎంపిక చేశాం. 


బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్‌తేజ్‌, నవీన్‌ పొలిశెట్టితో సినిమాలు చేస్తున్నాం. త్రివిక్రమ్‌, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చే సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందదు. 


Updated Date - 2022-10-03T05:57:57+05:30 IST

Read more