ఆసుపత్రిలో శౌర్య

ABN , First Publish Date - 2022-11-15T05:53:49+05:30 IST

యువ కథానాయకుడు నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు శౌర్య. ఆ సెట్లోనే కళ్లు తిరిగి పడిపోయారు...

ఆసుపత్రిలో శౌర్య

యువ కథానాయకుడు నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు శౌర్య. ఆ సెట్లోనే కళ్లు తిరిగి పడిపోయారు. కొంతకాలంగా ఓ పాత్ర కోసం హెవీ వర్కవుట్లు చేస్తున్నారట శౌర్య. శరీరాకృతిని మార్చుకోవడానికి జిమ్‌లో కసరత్తులు తీవ్రంగా చేస్తున్నారని, ఆ ప్రభావంతోనే ఆయన అలసటకు గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 20న శౌర్య వివాహం బెంగళూరులో జరగనున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-11-15T05:53:49+05:30 IST

Read more