సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మీ ఊహా శక్తి అతీతమైనది ‘మహారాజ’ మౌళి: శంకర్

ABN, First Publish Date - 2022-03-26T14:47:23+05:30

మీ ఊహా శక్తి అతీతమైనది 'మహారాజ' మౌళి అంటూ దర్శక ధీరుడు రాజమౌళిని ఉద్దేశించి అగ్ర దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ శంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బాహుబలి సిరీస్‌తో మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పారు రాజమౌళి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ ఊహా శక్తి అతీతమైనది 'మహారాజ' మౌళి అంటూ దర్శక ధీరుడు రాజమౌళిని ఉద్దేశించి అగ్ర దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ శంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బాహుబలి సిరీస్‌తో మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పారు రాజమౌళి. ఇప్పుడు ఆయన రూపొందిన భారీ పాన్ ఇండియన్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వైపుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి విజన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 


ఈ క్రమంలోనే దర్శకుడు శంకర్ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ఖాతా ద్వారా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై ప్రశంసలు కురిపించారు. 'ఆర్ఆర్ఆర్'కి ఒక కొత్త అర్ధాన్ని వివరిస్తూ.. మాకు ఓ గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు చిత్ర యూనిట్ అందరికీ చాలా థాంక్స్. రామ్ చరణ్ రేజింగ్ పెర్ఫార్మన్స్ మరియు తన స్క్రీన్ ప్రెజెన్స్.. అలాగే, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ నిలిచిపోతాయని అన్నారు. మీ ఊహా శక్తి అతీతమైనది హ్యాట్సాఫ్ ‘మహారాజ’ మౌళిగారు.. అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శంకర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రామ్ చరణ్‌తో శంకర్ ప్రస్తుతం ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-03-26T14:47:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!