Pathaan: యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తున్న ‘పఠాన్’ టీజర్

ABN , First Publish Date - 2022-11-02T21:49:03+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shahrukh Khan). చివరగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘జీరో’ లో నటించాడు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Pathaan: యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తున్న ‘పఠాన్’ టీజర్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shahrukh Khan). చివరగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘జీరో’ లో నటించాడు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ‘పఠాన్’ (Pathaan) పై భారీ బజ్ ఉంది. ఈ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. జాన్ అబ్రహం (John Abraham), దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 2న కింగ్ ఖాన్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీమ్ ‘పఠాన్’ టీజర్‌ను విడుదల చేసింది. యాక్షన్ ప్రియుల్ని అలరించేలా ఈ మూవీ రూపొందినట్టు తెలుస్తోంది.       


‘పఠాన్ గురించి నీకెం తెలుసు’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. దీపికా పదుకొణె, జాన్ అబ్రహం చేసిన పోరాటాలు ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. ‘పఠాన్’ కు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించాడు. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని అతడికి పేరుంది. గతంలో అతడు దర్శకత్వం వహించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ‘పఠాన్‌’ పై కూడా భారీ అంచనాలున్నాయి. షారూఖ్ కొంత కాలం విరామం తీసుకుని వస్తుండటంతో ఆ అంచనాలు ఆకానంటాయి. మరి ఆ అంచనాలను ‘పఠాన్’ అందుకుంటుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.



Updated Date - 2022-11-02T21:49:03+05:30 IST