‘జవాన్‌’ వచ్చేది అప్పుడే...

ABN , First Publish Date - 2022-06-04T05:54:37+05:30 IST

షారుఖ్‌ఖాన్‌ సినిమా విడుదలై చాలా కాలమైంది. దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు షారుఖ్‌.

‘జవాన్‌’ వచ్చేది అప్పుడే...

షారుఖ్‌ఖాన్‌ సినిమా విడుదలై చాలా కాలమైంది. దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు షారుఖ్‌. అయితే ఆ సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ ఏదీ బయటకు రావడం లేదు. దాంతో బాద్‌ షా అభిమానుల్లో కంగారు మొదలైంది. అందుకే.. ఇప్పుడు షారుఖ్‌ - అట్లీ సినిమా అప్‌డేట్‌ ఇచ్చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘జవాన్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. 2023 జూన్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రాంతాలు, భాషలకు అతీతంగా అందరూ మెచ్చే చిత్రమిది. నాకు యాక్షన్‌ కథలంటే చాలా ఇష్టం. అందుకే ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. ఈ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు అట్లీకే దక్కుతుంద’’న్నారు షారుఖ్‌. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో విజువల్‌ వండర్‌. ఈ పాత్రని షారుఖ్‌ ఖాన్‌ తప్ప ఎవ్వరూ చేయలేరు. అన్నిరకాల ఎమోషన్స్‌నీ మేళవించాం’’ అన్నారు. గౌరీ ఖాన్‌ నిర్మిస్తున్న ‘జవాన్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 

Updated Date - 2022-06-04T05:54:37+05:30 IST

Read more