Sequel: వడివేలు సినిమాకి సీక్వెల్.. 24వ పులకేశిగా హింసించేది ఏవరంటే..
ABN , First Publish Date - 2022-10-31T14:29:31+05:30 IST
తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కమెడియన్ వడివేలు (Vadivelu). టాప్ స్టార్స్ పక్కన వరుసగా అవకాశాలు దక్కించుకుని తమిళ పరిశ్రమలో టాప్ కమెడియన్‌గా వెలుగొందారు..

తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కమెడియన్ వడివేలు (Vadivelu). టాప్ స్టార్స్ పక్కన వరుసగా అవకాశాలు దక్కించుకుని తమిళ పరిశ్రమలో టాప్ కమెడియన్‌గా వెలుగొందారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకి దూరమవుతూ వచ్చారు. అయితే.. ఈ కమెడియన్ హీరోగా పలు సినిమాలు చేశాడు. అందులో పీరియాడికల్ కామెడీ చిత్రం ‘హింసించే 23వ రాజు పులకేశి’ (Himsinche 23va Raju Pulikesi) ఒకటి. 2007లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే.. ఈ మూవీలో ఆయనకి బదులు ప్రస్తుత టాప్ తమిళ కమెడియన్, హీరో యోగిబాబు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళ చిత్ర పరిశ్రమలో ఎదురు లేకుండా కమెడియన్‌గా కొనసాగుతున్న యోగిబాబు (Yogibabu) అవకాశాలు వచ్చినపుడు సోలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2007లో వడివేలు హీరోగా నటించి సూపర్‌డూపర్ హిట్ అయిన ‘23వ పులకేశి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘24వ పులకేశి’ (24va Pulikesi) పేరుతో మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు శింబుదేవన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. శింబుదేవన్ మాత్రం.. ఈ సీక్వెల్‌లోని ప్రధాన పాత్రలో యోగిబాబును నటింపజేయాలని దర్శకుడు శింబుదేవన్ ఆలోచిస్తున్నారు. పురాణ కథాంశంతో హాస్య భరితంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
