Senji: రష్యా భామతో కలిసి.. కోటలోని నిధిని..

ABN , First Publish Date - 2022-11-17T16:23:13+05:30 IST

గణేశ్‌ చంద్రశేఖర్‌, రష్యా నటి క్షెన్య పాన్‌బెరోవా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సెంజి’. ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది..

Senji: రష్యా భామతో కలిసి.. కోటలోని నిధిని..

గణేశ్‌ చంద్రశేఖర్‌, రష్యా నటి  క్షెన్య పాన్‌బెరోవా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సెంజి’ (Senji). ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ఏలియన్‌ పిక్చర్స్‌ బ్యానరు నిర్మించిన ఈ చిత్రాన్ని యాక్షన్‌ రియాక్షన్‌ సంస్థ విడుదల చేయనుంది. సెంజి కోటలో నిధులను శోధించే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. కథ పరిశీలిస్తే, ఫ్రాన్స్‌కు చెందిన సోఫియా అనే యువతి పుదుచ్చేరిలోని తన పూర్వీకుల ఇంటికి వస్తుంది. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోరు.


అయితే.. ఆ ఇంటిలో ఉన్న పురాతన కళాఖండాలు సోఫియాను అమితంగా ఆకర్షిస్తాయి. పైగా అక్కడ ఉన్న ఏదో తెలియని ఒక అతీంద్రియశక్తి ఆమెను ఆవహిస్తుంది. దీంతో భయపడిన ఆమె జాక్‌ అండర్సన్‌ అనే ఆర్కియాలజిస్టును సంప్రదిస్తుంది. వారిద్దరు కలిసి అక్కడ ఏదో ఉందన్న నిర్థారణకు వచ్చి తమ అన్వేషణ ప్రారంభించి అక్కడ నిజంగా నిధి (treasury) ఉందా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాకు స్టోరీ, రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన గణేశ్‌ చంద్రశేఖర్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఎల్వీ ముత్తు గణేష్‌ సంగీత సమకూర్చిన ఈ చిత్రానికి హరీష్‌ జిండే ఛాయాగ్రహణం సమకూర్చారు.

Updated Date - 2022-11-17T16:23:13+05:30 IST