సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిర్మాత M Ramakrishna Reddy కన్నుమూత ..

ABN, First Publish Date - 2022-05-26T14:05:16+05:30

ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి (M Ramakrishna Reddy) (76) మృతి చెందారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్టోక్‌తో కన్నుమూశారు. శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ (Sri Ramakrishna)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి (M Ramakrishna Reddy) (76) మృతి చెందారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ (Sri Ramakrishna Films) అనే నిర్మాణ సంస్థను స్థాపించి 1973లో రంగనాథ్ (Ranganath), శారద (Sarada) జంటగా.. ఎస్.వి. రంగారావు (S V Ranga Rao), రాజబాబు (Rajababu), అంజలీ దేవి (Anjali Devi), రమాప్రభ ముఖ్య పాత్రల్లో అభిమానవంతులు చిత్రాని నిర్మించారు. అలాగే, వాకాడ అప్పారావుతో కలిసి చంద్ర మోహన్ హీరోగా మూడిళ్ల ముచ్చట చిత్రాన్ని నిర్మించారు. సీతాపతి సంసారం, వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, మావూరి దేవత, కృష్ణ హీరోగా అగ్ని కెరటాలు, శోభన్ బాబు హీరోగా అల్లుడు గారు జిందాబాద్ చిత్రాలు నిర్మించారు.


1948లో నెలూరు జిల్లా గూడూరులో సుబ్బరామిరెడ్డి, మస్తానమ్మ దంపతులకు జన్మించారు రామకృష్ణారెడ్డి. మైసూర్ విశ్వ విద్యాలయంలో బి.ఇ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సిమెంట్ రేకుల వ్యాపారం చేశారు. ఆ తర్వాత తన బంధువు అయిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయనకు ఇద్దరు కుమారులు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల పలువు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2022-05-26T14:05:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!