సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్‌ నటుడు డీఎస్‌ రాజా మృతి

ABN, First Publish Date - 2022-07-01T16:02:48+05:30

సీనియర్‌ నటుడు, స్టంట్‌ కళాకారుడు డీఎస్‌ రాజా (88) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. మాజీ ముఖ్యమంత్రులు దివంగత ఎంజీఆర్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), జూన్‌ 30: సీనియర్‌ నటుడు, స్టంట్‌ కళాకారుడు డీఎస్‌ రాజా (88) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. మాజీ ముఖ్యమంత్రులు దివంగత ఎంజీఆర్‌, కరుణానిధి వంటివారితో సన్నిహిత సంబంధాలున్న ఈయన స్టంట్‌ యూనియన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాగే, జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ ప్రారంభానికి వెన్నెముకగా నిలిచారు. దక్షిణ భారత నడిగర్‌ సంఘంలో 32 యేళ్ళపాటు కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు. దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల సంఘం (ఫెఫ్సీ)కి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. వృద్దాప్య సమస్యలతో పాటు అనారోగ్యం కారణంగా ఎంజీఆర్‌ నగరులోని అళగిరి వీధిలోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈయన భౌతికకాయానికి నడిగర్‌ సంఘం ఉపాధ్యాక్షుడు పూచ్చి మురుగన్‌ నివాళులు అర్పించారు. గురువారం నెశప్పాక్కంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు. 



Updated Date - 2022-07-01T16:02:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!