సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీనియర్‌ నటి భార్గవి కన్నుమూత

ABN, First Publish Date - 2022-02-16T17:52:16+05:30

కన్నడ సీనియర్‌ నటి భార్గవి నారాయణ్‌ (84) బెంగళూరులో కన్నుమూశారు. వయోసహజ భారంతో ఇబ్బంది పడుతున్న ఆమె సోమవారం రాత్రి తుది శ్వాసవీడారు. ఈనెల 4న 84వ పుట్టినరోజు జరుపుకొన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌తోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కన్నడ సీనియర్‌ నటి భార్గవి నారాయణ్‌ (84) బెంగళూరులో కన్నుమూశారు. వయోసహజ భారంతో ఇబ్బంది పడుతున్న ఆమె సోమవారం రాత్రి తుది శ్వాసవీడారు. ఈనెల 4న 84వ పుట్టినరోజు జరుపుకొన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌తోపాటు ‘రాజకుమార’లో నటించి అభిమానులను మెప్పించారు. రంగస్థల కళాకారిణి నుంచి వెండితెరకు వచ్చిన ఆమె స్వయంగా రచయిత కూడా. తన ఆత్మకథ ‘నాను భర్గవి’ 2012లో విడుదలైంది. 1947లో ఎర డు కనసు, 1983లో పల్లవి అనుపల్లవి, బా నల్లె మధుచంద్రిక (199 3)లో ఈమె నటించిన హిట్‌ సినిమాలు. సినిమాలతోపాటు టీవీ సీరియల్స్‌, దూరదర్శన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. పిల్లల కోసం పలు నాటకాలు రాసి దర్శకత్వం వహించారు. కన్నడ నాటక అకాడమీ సభ్యురాలిగా, బెంగళూరు ఈఎప్‌ఐ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా వ్యవహరించారు. 1974-75లో అత్తుత్తమ క్యారెక్టర్‌ నటిగా, 1998లో రాష్ట్ర నా టక అకాడమీ పురస్కారం, 2005లో ఆళ్వాస్‌ నుడిసిరి తదితర పురస్కారాలు అందుకున్నారు. వీరి సంతానం సుజాతా బెళవాడి, ప్రకాశ్‌ బెళవాడి, ప్రదీప్‌ బెళవాడి, సుధా బెళవాడి, మనుమరాలు సంయుక్తా హొర్నాడ్‌ విచారంలో మునిగారు. భార్గవి మృతి పట్ల సినీరంగం విచారం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-02-16T17:52:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!